Arjun Suravaram
Cadbury Dairy Milk: డైరీ మిల్క్.. ఈ చాకెట్లు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంతో మందికి ఫేవరెట్ చాకెట్ల్ గా డైరీ మిల్క్ ఉంటుంది. అయితే అలాంటి ఈచాకెట్ల్ బ్రాండ్ కి డ్యామెజ్ ఏర్పడింది. తాజాగా మరోసారి డైరీ మిల్క్ వార్తలో నిల్చింది.
Cadbury Dairy Milk: డైరీ మిల్క్.. ఈ చాకెట్లు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంతో మందికి ఫేవరెట్ చాకెట్ల్ గా డైరీ మిల్క్ ఉంటుంది. అయితే అలాంటి ఈచాకెట్ల్ బ్రాండ్ కి డ్యామెజ్ ఏర్పడింది. తాజాగా మరోసారి డైరీ మిల్క్ వార్తలో నిల్చింది.
Arjun Suravaram
ప్రతి ఒక్కరికి చాకెట్లు అంటే చాలా ఇష్టం. ఇదే సమయంలో మార్కెట్లో అనేక రకాల చాకెట్లు అందుబాటులో ఉంటాయి. అలానే కొన్ని రకాల చాకెట్లు ఉత్పత్తులపై వివిధ ఆరోపణలు, విమర్శలు కూడా వస్తుంటాయి. అలానే కొన్ని నాణ్యతలేని చాకెట్లకు సంబంధించిన వార్తలు మనం చూస్తూనే ఉంటాయి. ఇది ఇలా ఉంటే.. ఇటీవలే ఎక్కువగా వైరల్ అయ్యిన న్యూస్ డైరీ మిల్క్. ఈ ఉత్పత్తిపై ఫిర్యాదాలు వచ్చిన సంగతి తెలిసింది. తెలంగాణ ఫుడ్ సేఫ్టి డిపార్టమెంట్ సైతం రంగంలోకి దిగి, పరీక్షలు నిర్వహించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆ బ్రాండ్ ప్రతిష్ఠకు డ్యామేజ్ ఏర్పడింది.
డైరీ మిల్క్.. ఈ చాకెట్లు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాకెట్ల విభాగంలో చాలా కాలం పాటు రారాజులాగా కొనసాగింది. ఈ డైరీ మిల్క్ చాకెట్లను సైతం ఎంతో మంది ఇష్టపడే వారు. తియ్యని వేడుక చేసుకుందాం’ అంటూ భారతీయుల మదిని డైరీ మిల్క్ బ్రాండ్ తాకింది. ఇదే సమయంలో ఆ బ్రాండ్ ప్రతిష్టకు డ్యామేజ్ ఏర్పడింది. ఆ ఉత్పత్తుల్లో నాణ్యత లేని వార్తలు వచ్చాయి. అలానే తెలంగాణ ఫుడ్ సేఫ్టి డిపార్ట్మెంట్ సైతం పరీక్షలకు సిద్ధమైంది. ఇక ఈ ఇష్యూ జరిగి సరిగ్గా మూడు నెలల కాకముందే మరోసారి డైరీ మిల్క్ చాక్లెట్ పై ఫిర్యాదులు వచ్చాయి.
సోషల్ మీడియా ద్వారా ఈ ఫిర్యాదు దర్శనమిచ్చాంది. ఈసారి ఏకంగా డైరీ మిల్క్ చాక్లెట్ కుళ్లిపోయిందంటూ ఓ నెటిజన్ ఫొటోలు షేర్ చేశారు. గతంలో ఎక్కడైతే డైరీ మిల్క్ మీద ఫిర్యాదు వచ్చింది.. అదే ప్రాంతమైన హైదరాబాద్ లోని అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లోనే మరోసారి ఇలా జరగింది. ఇలా డైరీ మిల్క్ తో మరోసారి అమీర్ పేట్ వార్తల్లో నిలవడంతో సదరు సంస్థపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘హైదరాబాదీ పిల్లా’ అనే సోషల్ అకౌంట్ ద్వారా ఈ డైరీ మిల్క్ వ్యవహారం సామాజిక మాద్యమంలో పోస్ట్ అయింది. అమీర్ పేట మెట్రోస్టేషన్ లో డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశామని ఆ పోస్టులో పేర్కొంది.
ఇక కొనుగోలు చేసి తీరా తిందామని ఓపెన్ చేసే సమయానికి అందులో బూజు కనిపించినట్లు నెటిజన్ పేర్కొన్నాడు. జనవరి 2024 కాగా 12 నెలల వరకు ఎక్స్‌పైరీ డేట్ ఉందని స్పష్టం చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి అమీర్ పేట్ మెట్రో స్టేషన్, డైరీ మిల్క్ వార్తల్లో నిలిచాయి. పలువురు నెటిజన్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వైరల్ అవుతున్న ఈ ఘటనపై ఆహార భద్రత అధికారులు అధికారులు స్పందించాల్సి ఉంది. మొత్తంగా మూడు నెలల వ్యవధిలో డైరీ మిల్క్ వ్యవహారం మరోసారి బయట పడింది.
The manufacturing of these dairy milk is January 2024, expiry is best before 12 months from manufacture.
Found them like this when I opened it. Look into this @DairyMilkIn pic.twitter.com/ZcAXF2Db6x
— That Hyderabadi pilla (@goooofboll) April 27, 2024