ఆరోగ్యశ్రీపై కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్.. ఇకపై..

Telangana Aarogyasri: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటీ నెరవేరుస్తామని వాగ్దానం చేశారు.

Telangana Aarogyasri: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటీ నెరవేరుస్తామని వాగ్దానం చేశారు.

ఇటీవల మనిషి ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తుంది.. వివిధ రోగాలు వస్తుంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు మేలు చేసే పథకాలు అమలు చేస్తుంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల హామీ నెరవేర్చుందుకు కృషి చేస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల బీమా సౌకర్యం కల్పించారు. తాజాగా తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఆరోగ్య శ్రీ చికిత్సలకు సంబంధించిన రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ చికిత్సల ధరలను సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ తాజాగా సర్కార్ జీవో 30 ని జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆ జీవోలో పేర్కొన్నారు. ఇటీవల ఆరోగ్య శ్రీలో కొత్తగా 163 చికిత్సలను చేర్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఆరోగ్యశ్రీ లో కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.438 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు.

ఆరోగ్య శ్రీ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నో కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని సంతోషం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీకి సంబంధించిన అదనపు ఖర్చు ర.600 కోట్లు పెరిగిన విషయాన్ని వివరించారు. ఆరోగ్య శ్రీ ట్రస్టు దాదాపు 6 లక్షల మందికి బాసటగా నిలిచిందన్నారు. కొత్త ప్రొసీజర్లతో మరో లక్షన్నర కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోబోతుందని మంత్రి దామోదర నర్సింహా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 79 లక్షల కుటుంబాలను ఆరోగ్య పరంగా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.

 

Show comments