iDreamPost
android-app
ios-app

స్మితా వెళ్లి.. ఆమ్రపాలి రాబోతున్నారా? రేవంత్ కి ఓ లెక్క ఉంది!

Amrapali,Smita: ఐఏఎస్ అధికారణి.. ఆమ్రపాలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డైనమిక్ ఆఫీసర్ గా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవలే సెంట్రల్ డిప్యూటేషన్ పూర్తి చేసుకుని తెలంగాణకు వచ్చిన ఆమె.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలోనే ఓ టాక్ వినిపిస్తోంది.

Amrapali,Smita: ఐఏఎస్ అధికారణి.. ఆమ్రపాలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డైనమిక్ ఆఫీసర్ గా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవలే సెంట్రల్ డిప్యూటేషన్ పూర్తి చేసుకుని తెలంగాణకు వచ్చిన ఆమె.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలోనే ఓ టాక్ వినిపిస్తోంది.

స్మితా వెళ్లి.. ఆమ్రపాలి రాబోతున్నారా? రేవంత్ కి ఓ లెక్క ఉంది!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 7వ తేదీన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఇక రాష్ట్రంలోని కీలక అధికారులు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. అలానే ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి కూడా తెలంగాణ నూతన సీఎంని కలిశారు. ఈక్రమంలోనే అనేక సందేహాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సీఎంవోలోకి ఆమ్రపాలి రాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఐఏఎస్ అధికారిణులు స్మితా సబర్వాల్, ఆమ్రపాలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు వివిధ జిల్లాలకు కలెక్టర్లుగా పని చేసి.. తమదైన మార్క్ చూపించారు. ఇక స్మితా సబర్వాల్ సీఎంవో చీఫ్ సెక్రటరీగా పని చేశారు. అలానే ఆమ్రపాలి ఇప్పటి వరకు డిప్యూటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే అక్కడ విధులు పూర్తి చేసుకుని..తిరిగి తెలంగాణకు ఆమె వచ్చారు. ఈ నేపథ్యంలోనే నూతన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆమె కలిశారు. దీంతో సిత్మా సబర్వల్ స్థానంలో ఆమ్రపాలి రావొచ్చని టాక్ వినిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిత్మా సీఎం ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆమెను ఆ విధుల నుంచి తప్పించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వీరిద్దరి సర్వీస్  విషయానికి వస్తే.. స్మితా సబర్వాల్‌, ఆమ్రపాలి మధ్య వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చాలా దగ్గరి పోలికలు కనిపిస్తాయి. ఇద్దరు అతిపిన్న వయస్సులోనే సివిల్స్ కి ఎంపికయ్యారు. స్మితా సబర్వాల్‌ 4వ ర్యాంకు సాధిస్తే, ఆమ్రపాలి 39వ ర్యాంక్‌ సాధించి, ఐఏఎస్‌గా ఎంపిక అయ్యారు. అలానే విధుల విషయంలోనూ వీరిద్దరు చాలా స్ట్రిక్ట్ అనే పేరు ఉంది. సోషల్‌ మీడియాలో అయితే ఈ ఇద్దరికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

ఇక సిత్మా సబర్వాల్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేశారు. అలానే ఆ టైమ్ లో మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు.. వరంగల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆమ్రపాలి గొడవ జరిగిందని టాక్. అప్పటి నుంచి బీఆర్ఎస్ పెద్దలకు, ఆమ్రపాలికి మధ్య దూరం పెరిగింది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆ తర్వాత కలెక్టరేట్ బంగ్లాలో దెయ్యం ఉందని ఆమ్రపాలి కామెంట్లు చేయడంతో ఆమె మీద బదిలీ వేటు పడడం  జరిగింది. చివరగా 2018 ఎన్నికల సమయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆమ్రపాలి, కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యూటీషన్ వెళ్లారు.

తాజాగా ఆ విధులు పూర్తి చేసుకొని.. తిరిగి తెలంగాణకు రాబోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసిన స్మితా సబర్వాల్‌ ఎలాగూ సచివాలయంలో కనిపించరని దాదాపు కన్ఫార్మ్ అయినట్లే. స్మితా వెళ్లి.. ఆమ్రపాలి రాబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది.  కారణంగా ఆమ్రపాలికి.. స్మితా స్థానంలో విధులు అప్పగించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తోన్నాయి. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఓ లెక్క ఉందని.. అందుకు తగినట్లే ఆమ్రపాలికి సెక్రటరీయేట్ లో కీలక బాధ్యతలు అప్పగించ వచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. మరి.. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.