iDreamPost
android-app
ios-app

మరోసారి అమిత్ షాతో NTR భేటీ? ఆసక్తిగా మారిన రాజకీయం..

  • Author Soma Sekhar Published - 03:27 PM, Fri - 3 November 23

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కాబోతున్నారట.

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కాబోతున్నారట.

  • Author Soma Sekhar Published - 03:27 PM, Fri - 3 November 23
మరోసారి అమిత్ షాతో NTR భేటీ? ఆసక్తిగా మారిన రాజకీయం..

సినీ పరిశ్రమకు రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఎంతో మంది నటీ, నటులు ఇండస్ట్రీలో సత్తాచాటి.. అటు పాలిటిక్స్ లో కూడా తమదైన ముద్రవేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి మెుదలైంది. నామినేషన్లు స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే? మరోసారి అమిత్ షా-ఎన్టీఆర్ భేటీ కాబోతున్నారని. గతేడాది వీరిద్దరు హైదరాబాద్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజాగా మరోసారి వీరిద్దరు భేటీ కాబోతున్నారన్న వార్తలు వైరల్ గా మారాయి.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. విడతల వారీగా తమ అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేస్తోంది బీజేపీ. ఎన్నికల నేపథ్యంలో ఓ వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కాబోతున్నారంటూ వార్తలు కోడైకూస్తున్నాయి. గతేడాది వీరిద్దరు నోవాటెల్ హోటల్ లో దాదాపు అరగంట సేపు ముచ్చటించుకున్నారు. ఈ భేటీ అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఈ వార్త వైరల్ గా మారడానికి ప్రధాన కారణం.. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పొత్తులకు తెరతీయడమే.

తొలుత తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకుందామని భావించింది బీజేపీ. కానీ పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ముందుకు వెళ్లింది. ఇక ఇలాంటి టైమ్ లో వీరిద్దరు భేటీ అవ్వబోతున్నారన్న వార్తలు ప్రాధానత్య దక్కించుకున్నాయి. ఏదిఏమైనప్పటికీ.. అమిత్ షా-ఎన్టీఆర్ భేటీ అయితే ఏ విషయాలు చర్చించుకుంటారు? ఈ భేటీకి రాజకీయ పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? లేదా ఇతర అంశాలా? అన్న విషయాలపై స్పష్టతరావాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş