iDreamPost
android-app
ios-app

RTC చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు.. ఒక్కరోజులోనే ఎన్నికోట్లంటే?

  • Published Dec 20, 2023 | 9:02 AM Updated Updated Dec 20, 2023 | 10:00 AM

ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.. కాంగ్రెస్ దిగ్విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై దృష్టి సారిస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు పరిచింది.

ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.. కాంగ్రెస్ దిగ్విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై దృష్టి సారిస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు పరిచింది.

RTC చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు.. ఒక్కరోజులోనే ఎన్నికోట్లంటే?

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం ఆరు గ్యారెంటీలపై చేశారు. ఇప్పటికే రెండు పథకాలు అమల్లోకి తీసుకువచ్చారు. అందులో ‘మహాలక్ష్మి’ మహిళలకు పథకం కింద ఉచిత బస్ సౌకర్యం, పేద ప్రజలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల చేయూత పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ ఆదాయం భారీగా పెరిగిందని అంటున్నారు. వాస్తవానికి ఈ పథకం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీకి భారీ నష్టాలు వస్తాయని విమర్శించారు.. కానీ దానికి భిన్నంగా ఆర్టీసి సంస్థలకు మంచి లాభాలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహలక్ష్మి పథకం ద్వారా ప్రతిరోజు మహిళలు, ట్రాస్ జెండర్లు ఉచిత బస్సు ప్రయాణం చేసే అవకావం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లవొచ్చు. కాకపోతే తెలంగాణ మహిళ అయి ఉండాలి, ఆధార్ లేదా ఇతర ఐడెంటిటీ కార్డు కలిగి ఉండాలి. లేదంటే టికెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.500 జరిమానా విధిస్తారని తెలిపారు.  తెలంగాణ వ్యాప్తంగా నిత్యం 13 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తుంటే.. వారిలో 80 శాతం మహిళలే ఉంటున్నారని సమాచారం. ఈ పథకం ప్రారంభం అయినప్పటి నుంచి మహిళలు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణం చేయడం మొదలు పెట్టారు. విద్యార్థినులు, చిరు వ్యాపారులు, ఉద్యోగినులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పలు ఆర్టీసీ బస్టాండ్లలో రద్ది బాగా పెరిగిపోయింద. తాజాగా ఆర్టీసీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు నమోదు అయ్యింది.

RTC all time record in one day

ఆర్టీసీ చరిత్రలో ఆల్ లైమ్ రికార్డు నమోదైంది. సోమవారం, డిసెంబర్ 18 ఒక్కరోజే ఏకంగా రూ.21.11 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది.  ఈ నెలలో ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం రూ.259 కోట్లు. తెలంగాణ ఆర్టీ పరిధిలో 97 డిపోలు ఉంటే.. 96 డిపోలు లాభాలు ఆర్జించాయి. ఇది ఆల్ టైమ్ రికార్డు అని అంటున్నారు. ఈ నెల మొత్తానికి రూ.3.14 కోట్ల మేర లాభం ఉండవొచ్చని ఆర్టీసీ సంస్థ అంచనా వేస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇంతగా లాభాలు ఎప్పుడూ రాలేదని.. ఇదే తొలిసారి కావడం విశేషం అని అధికారులు అంటున్నారు. జీరో టికెట్లు మొదలైన తర్వాత తొలి సోమవారం 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా.. 30.12 లక్షల జీరో టికెట్లు జారీ అయినట్లు సమాచారం. సాధారణంగా కండెక్టర్ కి గరిష్టంగా 300 వరకు టికెట్స్ జారీ చేస్తుంటారు.. కొత్త పథకం అమల్లోకి వచ్చిన తర్వాత 450 కి మించి టికెట్స్ జారీ చేయాల్సి వస్తుంది. మొత్తానికి మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుందని విమర్శలు వచ్చినా.. ఇప్పుడు లాభాల బాటలో సాగుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.