విద్యార్థులకు అలర్ట్.. రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం!

Tomorrow is Holiday: విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు అలర్ట్.. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం రేపు సెలవు దినంగా ప్రకటించింది. కారణం ఏంటంటే..?

Tomorrow is Holiday: విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు అలర్ట్.. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం రేపు సెలవు దినంగా ప్రకటించింది. కారణం ఏంటంటే..?

విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన గమనిక.. ఫిబ్రవరి 8వ తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేయవని సర్కార్ వెల్లడించింది. ఈ విషయాన్ని విద్యార్థులు, ఉద్యోగులు గుర్తుంచుకోవాలని తెలిపింది. ముస్లింల పండుగ షబ్ – ఎ – మెరాజ్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు సెలవు దినంగా ప్రకటించింది. వాస్తవానికి ప్రభుత్వం రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 8వ తేదీన సెలవు రోజుగా ప్రకటించింది. దీన్ని ప్రస్తుతం సాధారణ సెలవు రోజుగా మార్చింది. ఇక షబ్-ఎ-మెరాజ్ ముస్లింలకు పవిత్రమైన రోజుగా బావిస్తుంటారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ.. జీవో విడుదల చేసింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగ దినం సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కార్ రిలీజ్ చేసిన సెలవుల క్యాలెండర్ లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్ కు సాధారణ సెలవు కాకుండా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. తాజాగా తెలంగాణ లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సాధారణ సెలవుగా మార్చి పబ్లిక్ హాలిడే గా ప్రకటించింది. ఈ క్రమంలోనే విద్యా సంస్థలు, ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ముస్లింల పవిత్రమైన పండుగ సందర్భంగా దీపాలతో అందంగా ముస్తాబు చేస్తారు.

ఫిబ్రవరి 8న షబ్-ఎ-మెరాజ్ సందర్బంగా ముస్లిం సోదరులు రాత్రంతా ప్రార్ధనలు చేస్తూ.. జాగారం చేస్తారు. మసీదులన్నీ కలకలలాడుతుంటాయి.  ఈ షబ్-ఎ-మెరాజ్ పండగ సందర్బంగా ఇస్రా, మెరాజ్ ల కథను మసిదుల్లో ఉండేవారికి వివరిస్తుంటారు. ముస్లింల పవిత్రమైన పండుగ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంపై ముస్లిలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో వేరే సెలవులు లేవు. మార్చి నెలలో మాత్రం వరుస సెలవులు ఉన్నాయి. మార్చి 8న మహాశివరాత్రి, 25న హూలీ, 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులు ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Show comments