P Krishna
తెలంగాణలో డిసెంబర్ 3 న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. డిసెంబర్ 7 న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణలో డిసెంబర్ 3 న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. డిసెంబర్ 7 న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
P Krishna
తెలంగాణ లో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేశారు. నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఆ హామీ సభావేదికపై నెరవేర్చుకున్నారు.. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగావశం కల్పించారు. అలాగే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల బీమా సౌకర్యం. ఈ రెండు పథకాలు ఇటీవల ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందేవిధంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు సీఎం. రేపటి నుంచి ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని అన్నారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యాంటీల స్కీమ్ తో ప్రజల్లోకి వెళ్లారు. ఈ మేరకు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పట్టం కట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల పోస్టర్, దరఖాస్తు ఫారం ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క, అధికారులు పాల్గొన్నారు. గురువారం డిసెంబర్ 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో ఐదు పథకాలు అయిన రైతు భరోసా, మహాలక్ష్మి, గుృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ఈ సందర్బంగా సీఎం అన్నారు. రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తులు చేసుకునే సౌకర్యం ఉంది. జనవరి 6 వరకు లబ్దిదారుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో ఉన్న నిస్సహాకులకు సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం, అధికారులకు దగ్గరైనపుడు సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. మా ప్రభుత్వం మారుమూల పల్లెలకు సంక్షేమ పథకాలు అందేలా చేస్తుంది. తండాలు, గూడాల ప్రజలు తమ కష్టాలు విన్నించుకునేందుకు సచివాలయం, ప్రజా భవన్ కి రావాల్సిన అవసరం లేదు.. ప్రజలను ప్రభుత్వం దగ్గరకు రప్పించకుండా.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తుంది. గ్రామ సభల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొంటారు.. వారికి భరోసా కల్పిస్తారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.