కష్టజీవికి ఇదేమి రాత? దేవుడా ఇంత అన్యాయమా?

‘అన్న అన్న రైతన్న.. నీకున్నవీ అప్పులు రోయ్ నాయనా.. అవమానాలేరోయ్ నాయనా’ అని ఓ సినీ కవి అన్నట్లు.. కర్షకుడికి దుక్కి దున్ని నాటి నుండే శ్రమ మొదలు అవుతుంది. ఈ కాయ కష్టంలో కొన్ని సార్లు..

‘అన్న అన్న రైతన్న.. నీకున్నవీ అప్పులు రోయ్ నాయనా.. అవమానాలేరోయ్ నాయనా’ అని ఓ సినీ కవి అన్నట్లు.. కర్షకుడికి దుక్కి దున్ని నాటి నుండే శ్రమ మొదలు అవుతుంది. ఈ కాయ కష్టంలో కొన్ని సార్లు..

ప్రతి ఒక్కరూ కష్టపడేది నాలుగు వేళ్లు లోపలికి వెళ్లాలని, కడుపు నిండా భోజనం చేయాలని. కానీ ఆ కడుపు నింపుతున్న రైతు మాత్రం కడలి సంద్రంలోనే మునిగిపోతున్నాడు. అతడి శ్రమ దుక్కి దున్నడం నుండే మొదలౌతుంది. దుక్కి దుక్కి, నారు పోసి, నీరు పెట్టి పంట చేతికి వచ్చే వరకు పసిబిడ్డలా సాకుతుంటారు. కానీ అతి వృష్టి, అనావృష్టి కారణంగా కొన్నిసార్లు పంటలు దెబ్బతింటాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట.. మార్కెట్ లో గిట్టుబాటు ధర రాకపోతే.. మరింత విలవిలలాడిపోతుంటాడు. శ్వేదం చిందిస్తూ నలుగురి కంచెంలో బువ్వ వచ్చేలా చేస్తున్న రైతును దళారీ చర్యలే కాదూ.. కొన్ని ప్రమాదాలు కూడా బలితీసుకుంటున్నాయి.

పొలం పనులకు వెళ్లిన ఓ మహిళ రైతు.. ఇంటికి శవమై తిరిగి వెళ్లింది. పొలంలో అనుకోకుండా విద్యుత్ షాక్‌కు గురై.. మరణించిన విషాద ఘటన సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ల పల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లబోయిని మధుప్రియ..రాకేశ్ భార్యాభర్తలు. వీరికి కొడుకు రిషి వర్దన్, కూతురు రిషిక ఉన్నారు. తమకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో పొలం చేసుకుంటూ బతుకున్నారు ఈ దంపతులు. మంగళవారం పొలంలో వరినాట్లు వేసేందుకు వెళ్లింది మధు ప్రియ. వరినాట్లు వేస్తున్న క్రమంలో మోటారుకు అనుసంధానించిన విద్యుత్ వైరుకు కట్టిన జే వైరు (ఇనుప తీగ) తెగి పొలంలో పడింది.

వరినాట్లు వేస్తున్న మధుప్రియ తీగను పక్కకు జరిపేందుకు ప్రయత్నించింది. అయితే ఇనుప తీగకు విద్యుత్ సరఫరా అవుతన్న విషయాన్ని ఆమె గుర్తించలేదు. ఈ తీగను పట్టుకోగానే..దానికి విద్యుత్ సరఫరా జరిగి ఆమెకు షాక్ కొట్టింది. పొలం పనులకు వచ్చిన వాళ్లు.. చూసి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చనిపోయినట్లు పేర్కొన్నారు. పొలం పనులకు వెళ్లిన ఈ కష్ట జీవిని.. కరెంట్ బలి తీసుకోవడంతో బంధువులు, గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. పిల్లలు రోదనలు చూసి మరింత చలించిపోయారు.  దేవుడు ఈ పిల్లలకు ఇంత అన్యాయం ఎలా  చేశావయ్యా అంటూ కన్నీరు కారుస్తున్నారు.

Show comments