Swetha
గ్రామంలో హోలీ పండుగ రోజు కోడిగుడ్డు వలన జరిగిన ఓ ఘర్షణ .. ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామంలో హోలీ పండుగ రోజు కోడిగుడ్డు వలన జరిగిన ఓ ఘర్షణ .. ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
హోలీ పండుగ రోజున.. ప్రపంచం అంతా ఎంతో ఆనందంగా సంబరాలు జరుపుకుంది. సాధారణంగా హోలీ పండుగ రోజున.. సరదా కోసం రంగులతో పాటు.. కోడిగుడ్లను కూడా కొట్టుకుంటూ ఉంటారు. ఇలా చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ చాలా సాధారణం . అయితే.. ఈ కోడిగుడ్ల వలన జరిగిన ఓ చిన్న ఘర్షణ కారణంగా.. ఓ నిండు ప్రాణం బలైపోయింది. దీనితో.. అప్పటివరకు సంతోషంగా సంబరాలు చేసుకున్న ఆ గ్రామమంతా విషాద ఛాయలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ విషాద సంఘటన జగిత్యాలలోని తిప్పన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన సురేష్, రమ(40) దంపతులకు .. రిషివర్ధన్, వాణి అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే, సురేష్ మాత్రం ఉపాధి కారణంగా దుబాయ్ లో నివసిస్తూ ఉంటాడు. ఇక పిల్లలతో రమ మాత్రమే గ్రామంలో ఉంటుంది. ఈ క్రమంలో రమ కుమార్తె వాణి.. ఇదే గ్రామానికి చెందిన బోగ ప్రకాశ్ అనే యువకుడిని.. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. రమ దంపతులు దానికి నిరాకరించారు. దీనితో ప్రకాశ్ ఈ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో హోలీ పండుగ రోజున వీరి ఇంట్లోకి కోడిగుడ్లు విసిరాడు. దాని కారణంగా.. రిషి వర్ధన్ కు ప్రకాశ్ కు మధ్య ఘర్షణ మొదలైంది.
ఈ క్రమంలో వారిని ఆపే ప్రయత్నంలో .. రమ వారికి అడ్డుపడగా.. ప్రకాశ్ కొడవలితో రమ మెడపై దాడి చేసాడు. ఈ దాడిలో ఆమె గొంతుకు తీవ్రగాయాలు కావడంతో.. వెంటనే కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు ఆమెను తరలించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమ.. మంగళవారం రాత్రి మృతిచెందింది. ఒక చిన్న కోడు గుడ్డు వలన జరిగిన ఘర్షణ కారణంగా.. రమ మృతి చెందడంతో .. గ్రామమంతా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటన గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. దీనితో రమ కుమారుడు.. రిషివర్ధన్ పిర్యాదు మేరకు.. ప్రకాశ్ పై .. హత్య కేసు నమోదు చేసినట్లు ఆ ఏరియా ఎస్సై సదాకర్ తెలిపారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.