iDreamPost
android-app
ios-app

కాషాయ దుస్తులతో పాఠశాలకు విద్యార్థులు..ప్రశ్నించినందుకు ప్రిన్సిపాల్‌ ఓవరాక్షన్ కేసు నమోదు

  • Published Apr 18, 2024 | 8:44 PM Updated Updated Apr 18, 2024 | 8:44 PM

తాజాగా హైదరాబాద్ మంచిర్యాల జిల్లాలో  ఓ దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు హాజరైనందుకు వెళ్లిన విద్యార్థులు కాషాయ వస్త్రాలు ధరించరనే కారణంతో.. పాఠశాల యాజమాన్యం చేసిన పనికి తీవ్ర వివాదం నెలకొంది. ఇంతకి ఏం జరిగిందంటే..?

తాజాగా హైదరాబాద్ మంచిర్యాల జిల్లాలో  ఓ దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు హాజరైనందుకు వెళ్లిన విద్యార్థులు కాషాయ వస్త్రాలు ధరించరనే కారణంతో.. పాఠశాల యాజమాన్యం చేసిన పనికి తీవ్ర వివాదం నెలకొంది. ఇంతకి ఏం జరిగిందంటే..?

  • Published Apr 18, 2024 | 8:44 PMUpdated Apr 18, 2024 | 8:44 PM
కాషాయ దుస్తులతో పాఠశాలకు విద్యార్థులు..ప్రశ్నించినందుకు ప్రిన్సిపాల్‌ ఓవరాక్షన్ కేసు నమోదు

దేశంలో కుల, మతల వివక్షణ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎప్పుడు ఇలాంటి విషయాలపై ఏదో ఒక వివాదం అడుగడుకి దర్శనిమిస్తూ ఉంటుంది. చాలామంది స్వార్థపరులు ఈ కుల మతల విబేధాలను సృష్టించి వాటిపై లేనిపోని అలజడులు సృష్టించడమే పనిగా పెట్టుకొని ఉంటారు. ఇప్పటికే ఈ కుల, మత వివక్షణ అనేది చివరికి పాఠశాలలో కూడా కొనసాగుతున్న ఘటనలు చాలానే చూశాం. గతంలో కూడా హిజాబ్ ధరించి కళాశాలకు రావడం పై కళాశాల యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే గతేడాది ఓ ఇంటర్నేషన ల్ స్కూల్ లో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారని కారణంతో.. ఓ ఇద్దరి విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించిన ఘటన కూాడా తెలిసిందే. అయితే ఈ ఘటన  మరువక ముందే తాజాగా తెలంగాణ విద్యా సంస్థల్లో మతపరమైన దుస్తులు ధరించకూడదంటూ మరోసారి ఓ కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా హైదరాబాద్ కు 250 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల జిల్లాలో  ఓ దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు హాజరైనందుకు వెళ్లిన విద్యార్థులు కాషాయ వస్త్రాలు ధరించరనే కారణంతో.. పాఠశాల యాజమాన్యం వారిని లోపలికి అనుమతించలేదు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాల యాజమాన్యం పై కేసు నమోదు చేసుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గ్రామంలోని బ్లెస్డ్ మదర్ థెరిసా హైస్కూల్‌లో గత రెండు రోజుల క్రితం..  కొంతమంది విద్యార్థులు కాషాయ దుస్తులు ధరించి పాఠశాలకు వెళ్లడాన్ని కేరళకు చెందిన ప్రిన్సిపాల్ జైమన్ జోసెఫ్ గమనించి అధికారులకు  తెలిపారు.  ఇక ఈ విషయమై విద్యార్థులను ప్రశ్నించగా..  21 రోజుల ఆచారం అయిన హనుమాన్ దీక్షను పాటిస్తున్నామని బదులిచ్చారు. కాగా, ఈ విషయం పై విద్యార్థుల తల్లిదండ్రులతో  చర్చించేందుకు  వారిని తీసుకురావలని ప్రిన్సిపాల్ కోరారు.

అయితే ఈ విషయం పై  విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల అధికారులపై మంగళవారం పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఇక  విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పాఠశాల యాజమాన్యం పై  మేరకు  సెక్షన్‌ 153 (ఎ) (మతం లేదా జాతి ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295 (ఎ) (మత భావాలను అవమానించడం) కింద కేసు నమోదు చేసినట్లు దండేపల్లి పోలీసులు తెలిపారు. కానీ, అంతలోనే క్యాంపస్‌లో హిందూ వేషధారణను ప్రిన్సిపాల్ అనుమతించడం లేదని ఎవరో సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేయడంతో  ఈ విషయం పై తీవ్ర దూమరమే రేపింది.  కాగా, కొద్దిసేపటికే  ఆ పాఠశాలపై గుంపుగా కాషాయ దుస్తులు ధరించిన కొందరు పురుషులు జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ పాఠశాలపై దాడికి దిగారు.

ఈ క్రమంలోనే పాఠశాల కిటికీ అద్దాలు పగలగొట్టారు. అయితే ఇదంతా చూస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు వారిని ఆపమని పోలీసులకు కోరారు. కానీ, అక్కడ పోలీసు సిబ్బంది ఎంత ప్రయత్నించిన వారిని అదుపు చేయలేకపోయారు. ఇక  క్యాంపస్‌లోని మదర్ థెరిసా విగ్రహంపై గుంపు రాళ్లు విసిరారు.  మరి కొంతమంది అయితే ఏకంగా.. ప్రిన్సిపాల్ జోసెఫ్‌ను చుట్టుముట్టి అతన్ని కొట్టారు. అలాగే బలవంతంగా  అతని నుదిటిపై తిలకం పూసారు. అలాగే మత పరంగా చేసిన వివాదం పై క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, కాషాయ వస్త్రాధారణలో ఉన్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం స్కూల్ కి అనుమతించకపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.