iDreamPost

‘అహ నా పెళ్ళంట’ సీన్ రిపీట్.. గుమ్మానికి కోడి! కారణం ఏమిటంటే?

  • Published Jan 24, 2024 | 3:18 PMUpdated Jan 24, 2024 | 3:18 PM

నగరాల్లో, గ్రామాల్లో అడపా దడపా వీధుల్లో కుక్కలా బెడద ఉంటూనే ఉంటుంది. దీని గురించి అధికారులకు అర్జీలు పెట్టుకున్నా.. కొన్ని ప్రాంతాలలో ఏ మాత్రం ఫలితం ఉండదు. తాజాగా ఓ వ్యక్తి దీనికి వ్యతిరేకంగా వినూత్న పద్దతిలో నిరసన తెలిపాడు.

నగరాల్లో, గ్రామాల్లో అడపా దడపా వీధుల్లో కుక్కలా బెడద ఉంటూనే ఉంటుంది. దీని గురించి అధికారులకు అర్జీలు పెట్టుకున్నా.. కొన్ని ప్రాంతాలలో ఏ మాత్రం ఫలితం ఉండదు. తాజాగా ఓ వ్యక్తి దీనికి వ్యతిరేకంగా వినూత్న పద్దతిలో నిరసన తెలిపాడు.

  • Published Jan 24, 2024 | 3:18 PMUpdated Jan 24, 2024 | 3:18 PM
‘అహ నా పెళ్ళంట’ సీన్ రిపీట్.. గుమ్మానికి కోడి! కారణం ఏమిటంటే?

సాధారణంగా పట్టణాల్లో, గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఉంటూనే ఉంటుంది. దీని గురించి ఇప్పటివరకు ఎన్నో వార్తలను కూడా చూశాము. వీధి కుక్కల కారణంగా బలి అయిన చిన్నారులు, గాయపడిన వారు ఇలా ఎంతో మంది ఉన్నారు. ఈ విషయంపై అధికారులకు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా సరే.. కొన్ని ప్రాంతాలలో ఉపయోగం లేకుండా పోతుంది. కొన్ని సార్లు కుక్కల దాడికి కొన్ని మూగ జీవాలు కూడా బలైపోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక కోడి కుక్కల దాడిలో చనిపోయింది. ఇలా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోకపోవడంతో.. ఓ వ్యక్తి చనిపోయిన ఆ కోడిని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ద్వారానికి కట్టి నిరసన తెలిపాడు. చూడడానికి అందరికి ఆశ్చర్యం కలిగించినా.. అధికారులకు వారి ఇబ్బందిని స్పష్టంగా తెలియజేసినట్లైంది.

ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి ప్రాంతంలో జరిగింది. ఈ దృశ్యాన్ని చూస్తే అందరికి ఓ పాత సినిమా గుర్తురావడం ఖాయం. జంధ్యాల డైరెక్షన్‌లో 1987 లో .. రాజేంద్ర ప్రసాద్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం కలిసి నటించిన కామెడీ చిత్రం “అహ నా పెళ్ళంట”. ఈ చిత్రం అప్పట్లో మంచి ఆదరణ పొందింది. అయితే, ఈ మూవీలో ఇప్పటికి ప్రత్యేకంగా గుర్తు చేసుకునే పాత్ర పిసినారి లక్ష్మీపతి. కొన్ని సన్నివేశాలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంటి దూలానికి బతికి ఉన్న కోడిని వేలాడదీసి.. దాన్ని చూస్తూ చికెన్‌ కూరతో అన్నం తింటున్నట్టుగా..ఉన్న సన్నివేశం ఇప్పటికి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట జరిగిన సన్నివేశం కూడా.. ఇలానే అనిపించింది. ఈ సినిమాను ఆదర్శంగా తీసుకుని చేశాడో లేదా వారి బాధను వ్యక్త పరచడానికి చేశాడో తెలీదు కానీ.. సరిగ్గా అలానే కుక్కల దాడిలో చనిపోయిన కోడిని కార్యాలయం గుమ్మానికి వేలాడతీశాడు ఓ వ్యక్తి.

కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పిల్లలు, కోళ్లు, మేకల మీద దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు స్థానికులు తమ సమస్యను చెప్పుకున్నా సరే ఉపయోగం లేకుండా పోయింది. దీనితో అజీజోద్దీన్ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా సరే లాభం లేదని.. కుక్కల దాడిలో చనిపోయిన కోడిని నేరుగా మున్సిపల్ ఆఫీసుకు తీసుకెళ్లాడు. అధికారులకు కోడిని చూపించి పరిస్థితిని చెప్పినా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దాంతో ఆ కోడిని మున్సిపల్ ఆఫీసు గుమ్మానికి వేలాడదీసి నిరసన వ్యక్తం చేశాడు. ఇక ప్రస్తుతం ఈ ఘటన కరీంనగర్ పట్టణంలో హాట్ టాఫిక్‌గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి