iDreamPost

హుస్సేన్ సాగర్ లో దూకిన వ్యక్తి.. కాపాడిన పోలీస్ కానిస్టేబుల్!

Tank Band: పోలీసులు తాము నిర్వర్తించే విధుల వల్లనో తప్పు చేసిన వారి పట్ల కఠినంగా ఉండటం కారణంగా ఎక్కువ మంది దృష్టిలో వేరేలాగా కనిపిస్తుంటారు. అయితే వాళ్లకూ మానవత్వం, సున్నితమైన మనసు ఉంటుందని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బయటపెడుతుంటాయి.

Tank Band: పోలీసులు తాము నిర్వర్తించే విధుల వల్లనో తప్పు చేసిన వారి పట్ల కఠినంగా ఉండటం కారణంగా ఎక్కువ మంది దృష్టిలో వేరేలాగా కనిపిస్తుంటారు. అయితే వాళ్లకూ మానవత్వం, సున్నితమైన మనసు ఉంటుందని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బయటపెడుతుంటాయి.

హుస్సేన్ సాగర్ లో దూకిన వ్యక్తి.. కాపాడిన పోలీస్ కానిస్టేబుల్!

సమాజంలో నేరాలు జరగకుండా చూడటం, అలా చేసే వారిని శిక్షించడం పోలీసులు బాధ్యత. అక్రమాలను,సంఘ విద్రోహక శక్తులను అరికట్టి, ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో కొందరు పోలీసులు సైతం తమ ప్రాణాలను కోల్పోతున్నరు. అంతేకాక న్యాయం కావాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన వారిని ఆదుకుంటున్నారు. అంతేకాక ఆపదలో ఉన్న సామాన్యులకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుతున్నారు. ఇప్పటికే అలాంటి ఘటనలు ఎన్నో జరగ్గా..తాజాగా హైదరాబాద్ నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది. ట్యాంక్ బండ్ లో దూకిన ఓ వ్యక్తి ప్రాణాలను పోలీస్ కానిస్టేబుల్ కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

పోలీసులు తాము నిర్వర్తించే విధుల వల్లనో తప్పు చేసిన వారి పట్ల కఠినంగా ఉండటం కారణంగా ఎక్కువ మంది దృష్టిలో వేరేలాగా కనిపిస్తుంటారు. అయితే వాళ్లకూ మానవత్వం, సున్నితమైన మనసు ఉంటుందని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బయటపెడుతుంటాయి. అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి వైరల్ అవుతోంది. హార్ట అటాక్, అలానే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతున్నారు. గతంలో ఓ సారి రాత్రి సమయంలో  ఓ వ్యక్తి నడిరోడ్డుపై గుండెపోటుతో పడిపోతే.. అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ కాపాడారు. తాజాగా హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ లో దూకిన వ్యక్తిని కానిస్టేబుల్ కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతంలో జరిగింది.

బుధవారం ఓ వ్యక్తి ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లి.. అందులోకి దూకి.. ఆత్మహత్యాయత్నం చేశాడు. అదే సమయంలోఆ వ్యక్తి దూకడాన్ని స్థానిక పోలీసు గమనించాడు. వెంటనే ఆ పోలీస్ కానిస్టేబుల్ అలర్ట్ అయ్యాడు.  అక్కడున్న వారిని కూడా ఆయన అలర్ట్ చేయడంతో ట్యాంక్ బండ్ లోకి దిగి..దూకిన వ్యక్తిని  ప్రాణాలతో కాపాడారు. అనంతరం అంబులెన్స్ లో బాధితుడిని సమీపంలోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతన్ని ఆరోగ్యం నిలకడగా ఉంది.  దూకిన వ్యక్తి వివరాలు, అతను ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడో  అనేది తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపైదీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ పై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో కూడా  ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి  పొలంలో పాము కాటుకు గురయ్యాడు. అతడిని ఓ కానిస్టేబుల్ తన భుజాలపై వేసుకుని రెండు కిలోమీటర్ల మేర పరుగులు తీశాడు. చివరకు ఊర్లోకి తీసుకొచ్చి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు నిలబడ్డాయి. అలానే మరో ప్రాంతంలో ఓ వ్యక్తి గుండె పోటుతో నడి రోడ్డుపై పడిపోతే.. వెంటనే అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఇలా చాలా సార్లు పోలీసులు దేవుళ్లుగా మారి ప్రమాదాలం ఉన్న వారిని రక్షిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి