Krishna Kowshik
ప్రేమ అనే రెండు అక్షరాల వలలో పడిపోయి.. అబ్బాయిలు, అమ్మాయిలు టైం పాస్ చేస్తున్నారు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు సెల్ ఫోనులో కబుర్లు, వీలు కుదిరినప్పుడల్లా సినిమాలు, షికార్లు చేస్తుంటారు. ఆ తర్వాత పెళ్లి దగ్గరకు వచ్చే సరికి మాత్రం..
ప్రేమ అనే రెండు అక్షరాల వలలో పడిపోయి.. అబ్బాయిలు, అమ్మాయిలు టైం పాస్ చేస్తున్నారు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు సెల్ ఫోనులో కబుర్లు, వీలు కుదిరినప్పుడల్లా సినిమాలు, షికార్లు చేస్తుంటారు. ఆ తర్వాత పెళ్లి దగ్గరకు వచ్చే సరికి మాత్రం..
Krishna Kowshik
ప్రియురాలితో ‘ఐలవ్ యు’ అనే పదం చెప్పించుకునేందుకు పగలు, రాత్రుళ్లు తేడా లేకుండా వెంటపడుతుంటాడు ప్రియుడు. ప్రేమికురాలు కోరకపోయినా, ఆమె కరుణ కోసం గిఫ్టులు తీసుకువస్తాడు. ఆమె కోసం ఏదైనా చేసేందుకు సిద్దపడతాడు. కానీ అదే ప్రియురాలు.. అతడి ప్రేమను యాక్సెప్ట్ చేస్తే.. ఏదో విజయాన్ని సాధించినట్లు పొంగిపోతుంటాడు. ఆ తర్వాత షరా మూమూలే. పార్కులు, బైకులపై షికార్లు, సినిమా థియేటర్లలో కార్నర్ సీట్లు.. ఒక్కటేమిటీ ప్రేమ అనే రెండు అక్షరాల మోహంలో మునిగితేలుతుంటారు. ఇక్కడ వరకు సజావుగా సాగిపోతుంటుంది వ్యవహారం. ఇక ప్రియురాలి పెళ్లి మాట ఎత్తితే.. అప్పుడు ప్రియుడిలోని అసలు నిజస్వరూపం బయటకు వస్తుంది.
నిజంగా ప్రేమిస్తే.. పెద్దలు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.. కానీ మోసం చేయాలని ఉద్దేశం ఉంటే అమ్మాయికి హ్యాండ్ ఇస్తాడు ప్రశాంత్లా. ఇంతకు ఈ ప్రశాంత్ ఏం చేశాడంటే.. ఓ అమ్మాయిని ప్రేమించి.. మరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు.. అతడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్.. అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. అయితే గత కొద్ది రోజుల క్రితం ప్రియుడు ప్రశాంత్.. మరో యువతిని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం ప్రియురాలికి తెలియడంతో ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టింది.
తనను ప్రేమించి, మరొకరితో వివాహానికి ఎలా సిద్దమవుతావంటూ అతడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడి నివాసం వద్ద నిరసన చేపడుతోంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ప్రాంతానికి చేరుకుని.. ఆ యువతిని వివరాలు అడి గి తెలుసుకున్నారు. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఇప్పుడు మోసానికి పాల్పడ్డాడని, మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్నాడని చెప్పడంతో.. ప్రియుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ప్రేమ పేరుతో వల పన్ని, మోసం చేస్తున్న ఇలాంటి అబ్బాయిల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఆడ పిల్లలకు ఉంది. మరీ మీరేమంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.