iDreamPost
android-app
ios-app

ప్రాణంగా భావించే భార్య మృతి! ఆమె కోసం భర్త చేసిన పనికి హ్యాట్సాఫ్!

  • Published Aug 30, 2024 | 5:07 PM Updated Updated Aug 30, 2024 | 5:07 PM

ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఓ జంటపై ఆ దేవుడు చిన్న చూపు చూశాడు. ఊహించని విధంగా ఆ ఇంట్లో ఇల్లలును విధి మృత్యు రూపంలో దూరం చేసింది. దీంతో భార్య మరణంతో జీర్ణించుకోలేని భర్త చేసిన పనికి అందరీ హృదయాలను కదిలించింది.

ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఓ జంటపై ఆ దేవుడు చిన్న చూపు చూశాడు. ఊహించని విధంగా ఆ ఇంట్లో ఇల్లలును విధి మృత్యు రూపంలో దూరం చేసింది. దీంతో భార్య మరణంతో జీర్ణించుకోలేని భర్త చేసిన పనికి అందరీ హృదయాలను కదిలించింది.

  • Published Aug 30, 2024 | 5:07 PMUpdated Aug 30, 2024 | 5:07 PM
ప్రాణంగా భావించే భార్య మృతి! ఆమె కోసం భర్త చేసిన  పనికి హ్యాట్సాఫ్!

ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, అలా వివాహం చేసుకున్న జంటల మధ్య ప్రేమ కొంత కాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అపార్థలు, ఈగోలు, స్వార్ధం,అనుమానాలు చివరికి అక్రమ సంబంధాలు వంటివి ఆ కాపురంలో దాపరిస్తుంటాయి. అలా కాకుండా.. ప్రేమించి పెళ్లి చేసుకొని.. ఒకరిని ఒకరు విడిచి ఉండలేక అనోన్యంగా ఉండే జంటలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ, ఇలా సర్వస్వంగా బతికే జంటలను చూస్తే.. ఆ దేవుడికి కూడా చాలా అసూయ, చిన్నచూపు.

అందుకే ప్రాణంగా బతికిన దాంపత్య జీవితంలో.. మార్చిపోలేని బాధను, దుఃఖాన్ని మిగిల్చుతాడు. ఈ నేపథ్యంలోనే  ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ దాంపత్య జీవితంలో కూడా విధి చాలా చిన్నచూపు చూసింది. భార్యే సర్వస్వం అనే బతికే ఆ భర్తను బతికుండగానే జీవచ్ఛవంలా విధి మార్చేసింది. దీంతో భార్య మరణాన్ని జీర్ణించుకోలేని ఆ భర్త.. తన భార్యకు గుర్తుగా చేసిన పని అందరి హృదాయాలను కదిలించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

The death of the wife who was considered as life!

 ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ ప్రేమించుకుని, 2006లో పెళ్లి చేసుకున్నారు.  అయితే అశోక్ ప్రైవేట్ జాబ్ చేస్తూ సత్తుపల్లి పట్టణంలో స్థిరపడ్డారు.  ఇక వీరిద్దరికి  ఒక కుమార్తె జన్మించింది.ఇక ఎలాంటి తగాదాలు లేకుండా ఆనందంగా సాగుతున్న ఆశోక్ కుటుంబంలో ఊహించని విషాదం నెలకొంది. తన భార్య పద్మశ్రీ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. దీంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ప్రేమించి పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్న 16 ఏళ్లకే తన భార్య ఆకస్మికంగా మృతి చెందడంతో ఆశోక్ తట్టుకోలేకపోయాడు. దీంతో తన భార్యకు  గుర్తుగా.. తన చేయి, తన కూతురు చేయి, చనిపోయిన తన భార్య చేయిని కలిపి విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాస్టింగ్ నిపుణులతో హ్యాండ్ కాస్టింగ్ తయారు చేయించుకున్నాడు.

ఇక దానిని గుర్తుగా తన ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే తన భార్య గుర్తుగా తాను తయారు చేయించిన ఈ హ్యాండ్ కాస్టింగ్ అందరీ హృదాయాలను కదిలిస్తోంది. అంతేకాకుండా.. భార్యపై ఆశోక్ ఉన్న ప్రేమ స్థానికుకలు భావోద్వేగానికి గురైయ్యేలా చేసింది. మరీ, భార్య గుర్తుగా భర్త హ్యాండ్ కాస్టింగ్ తయారు చేయించుకోని ఇంట్లో పెట్టుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.