Arjun Suravaram
Hyderabad: ఇటీవల హైదరాబాద్ నగరం పరిధిలో వరుసగా గంజాయి చాకెట్ల విక్రయం కలకలం రేపుతోంది. వీటి సరఫరాను నివారించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా..అక్కడక్కడ బయటపడుతున్నాయి. తాజాగా ఓ కిరాణ షాపులో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి.
Hyderabad: ఇటీవల హైదరాబాద్ నగరం పరిధిలో వరుసగా గంజాయి చాకెట్ల విక్రయం కలకలం రేపుతోంది. వీటి సరఫరాను నివారించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా..అక్కడక్కడ బయటపడుతున్నాయి. తాజాగా ఓ కిరాణ షాపులో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి.
Arjun Suravaram
కొందరు సులభంగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్, గంజాయి వంటి వాటిని అక్రమంగా సరఫరా చేస్తుంటారు. కాలేజీలు, పబ్స్ వంటి పలు ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఇలా డ్రగ్స్ ఒకవైపు, గంజాయి మరోవైపు యువత భవిష్యత్ ను నాశనం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో తరచూ గంజాయి పట్టుబుడతుంది. వీటి సరఫరాను నివారించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమ మార్గాల ద్వారా ఇవి హైదరాబాద్ కు చేరుతోన్నాయి. విద్యార్థులు, యువత టార్గెట్ గా డ్రగ్స్ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. కిరాణ షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. గతంలో జగద్గిరిగుట్టలోని ఓ కిరాణ షాపులో భారీ ఎత్తున గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. మరోసారి గంజాయి చాక్లెట్లు నగరంలో కలకలం రేపుతున్నాయి. తాజాగా మరోసారి ఓ కిరాణ షాపులో గంజాయి చాకెట్లు పట్టుబడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల హైదరాబాద్ నగరం పరిధిలో వరుసగా గంజాయి చాకెట్ల విక్రయం కలకలం రేపుతోంది. గతంలో జగద్గిరిగుట్టలో గంజాయి చాక్లెట్స్ ను విక్రయిస్తున్న కిరాణా దుకాణాలపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడుల సమయంలో పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లు, గంజాయి పౌడర్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా గంజాయి, డ్రగ్స్ వంటి వాటి సరఫరాపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేసి.. భారీగా పట్టుకుంటున్నారు. సరఫరా చేసే ముఠాలను పట్టుకుని జైలుకు పంపుతున్నారు. అయినా ఆ ముఠాల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇంకా దారుణం ఏమింటే..సరుకులు ఇచ్చే కిరాణ షాపుల్లో కూడా గంజాయిను సప్లయ్ చేస్తున్నారు. చాక్లెట్స్ రూపంలో పెట్టి అమ్ముతున్నారు. తాజాగా ఓ కిరాణ దుకాణంలో భారీ ఎత్తున గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. కుత్బుల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని జగద్గిరి గుట్టలో ఈ గంజాయి బయటపడింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్ లోని ఓ కిరాణ షాప్ లో గంజాయి చాక్లెట్లుఅ విక్రయిస్తున్నారు. వాటిని అమ్ముతున్న సునీత దేవి గోస్వామి అనే మహిళను బాలానగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 9.5 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలోనే ఓ దుకాణంలో కూడా గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. వీటిని సరఫరా చేసే వారికి కఠినమైన శిక్షలు విధించాలనే జనాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ గంజాయి కారణంగా ఎంతో మంది యువత జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. అంతేకాక తల్లిదండ్రులకు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు వేస్తుంది.