Krishna Kowshik
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి. మద్యం ఏరులై పారుతూ ఉంటుంది. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు వస్తువులు తరలిస్తున్నారు. దీంతో కట్టడి చర్యలు ప్రారంభించారు పోలీసులు.
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి. మద్యం ఏరులై పారుతూ ఉంటుంది. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు వస్తువులు తరలిస్తున్నారు. దీంతో కట్టడి చర్యలు ప్రారంభించారు పోలీసులు.
Krishna Kowshik
ఎన్నికలు రావడం ఆలస్యం.. పోలీసుల తనఖీల్లో కోట్ల కొద్దీ అక్రమ డబ్బు దొరికిన సంఘటనలు అనేకం చూశాం. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఆ సమయంలో పోలీసులు ఉదృత్తంగా తనిఖీలు చేపట్టి.. పెద్ద మొత్తంలో డబ్బులు, అలాగే ఓటర్లను మభ్య పెట్టేందుకు సిద్ధం చేసిన సామాన్లను సైతం పట్టుకున్నారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల పర్వం మొదలైంది. ఈ క్రమంలో మళ్లీ భారీ మొత్తంలో బ్లాక్ మనీ రవాణా జరుగుతుంది. చెక్ పోస్టుల వద్ద నిరంతరాయంగా తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. డబ్బు, మద్యం, మత్తు పదార్ధాలు తరలించడకుండా తగిన చర్యలు తీసకుంటున్నారు. పోలింగ్ సమయం మరింత దగ్గర పడుతుండటంతో తనిఖీలు ముమ్మురం చేశారు.
తాజాగా సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) రూ. 98 లక్షల డబ్బును పట్టుకుంది. అవి కూడా బ్యాంకులకు నగదు తీసుకెళ్లే వాహనాల్లో ఈ డబ్బును స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రెండు వాహనాలలో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును సీజ్ చేశారు సైబరాబాద్ పోలీసులు. సైబరాబాద్ SOT మేడ్చల్ టీమ్, శామీర్ పేట్, దుండిగల్ పోలీస్ స్టేషన్స్ సిబ్బందితో 98,32,200 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. క్యూఆర్ కోడ్స్, ఎన్నికల సంఘం నిబంధనలు పాటించకుండా రెండు వాహనాల్లో అక్రమ రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. CMS క్యాష్ లాజిస్టిక్స్ వాహనం TS 09 UE 0549లో 50 లక్షలను పట్టుకుంది మేడ్చల్ ఎస్వోటీ టీమ్ . ఈ ఘటనపై శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అలాగే.. క్యాష్ లాజిస్టిక్స్ వాహనం TS 09 UD 6991లో రూ. 48,32,200 నగదును తరలిస్తుండగా సీజ్ చేశారు. దుండీగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత నెల చివరి వరకు పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 104.18 కోట్ల విలువైన నగదు, నగలు, మద్యం, మత్తు పదార్థాలను పట్టుకున్నారు పోలీసులు. అందులో 63 వేల కోట్ల నగదు, 5.38 కోట్ల రూపాయాల మద్యం, 7.12 కోట్ల రూపాయల విలువ చేసే నార్కోటిక్స్ డ్రగ్స్, రూ. 21.34 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో ప్రజలను ప్రలోభ పెట్టేందుకు నగదు పెద్ద మొత్తంలో చేతులు మారుతుంది. ఇక తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థులు జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.