P Venkatesh
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. భారీ సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ఏకంగా 78 రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు. మరికొన్ని రైళ్లను దారిమళ్లించారు. ఎప్పటి వరకు రద్దయ్యాయంటే?
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. భారీ సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ఏకంగా 78 రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు. మరికొన్ని రైళ్లను దారిమళ్లించారు. ఎప్పటి వరకు రద్దయ్యాయంటే?
P Venkatesh
మీరు ఈ మధ్య ఎక్కడికైనా ట్రైన్ జర్నీ చేసే ప్లాన్ లో ఉన్నారా?అయితే మీకు బిగ్ అలర్ట్. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఇటీవల పలు రూట్లలో పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు.. స్టేషన్లలో ఆధునిక వసతులు కల్పించేందుకు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది రైల్వే శాఖ. మరోవైపు కొత్త రైల్వే లైన్ నిర్మాణాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తూ.. మరికొన్ని రైళ్లను దారిమళ్లిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 78 రైళ్లు రద్దయ్యాయి. 26ఎక్స్ ప్రెస్ రైళ్లను దారిమళ్లించారు. ఇంతకీ ఏ రూట్లలో అంటే?
కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఈ రూట్లో ప్రయాణించే వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఆసిఫాబాద్-రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేశారు అధికారులు. 26 ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. దాదాపు 11 రోజుల పాటు రైళ్లు రద్దు కానున్నాయి. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్‌ల మధ్య తిరిగే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (నం.12757/12758) జూన్ 26 నుంచి జులై 6 వరకు రద్దయ్యాయి. పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్ (నం.22151) ఈ నెల 28, జులై 5న, కాజీపేట-పుణె ఎక్స్‌ప్రెస్ (నం.22152) జూన్ 30, జులై 7న.. హైదరాబాద్-గోరఖ్‌పుర్ (నం.02575) జూన్ 28న, గోరఖ్‌పుర్-హైదరాబాద్ (నం.02576) ఎక్స్‌ప్రెస్ జులై 30న రద్దయ్యాయి.
ముజఫర్‌పుర్-సికింద్రాబాద్ (నం.05293) జులై 2న, సికింద్రాబాద్-ముజఫర్‌పుర్ (నం.05294) జూన్ 27, జులై 4న.. గోరఖ్‌పుర్-జడ్చర్ల (నం.05303) రైలు జూన్ 29న, జడ్చర్ల-గోరఖ్‌పుర్ (నం.05304) రైళ్లు జులై 1న క్యాన్సిల్ అయ్యియి. సికింద్రాబాద్-రాక్సల్ మధ్య నడిచే వేర్వేరు మూడు రైళ్లు జూన్ 26, 27, 28 తేదీల్లో.. సికింద్రాబాద్-దానాపుర్‌ల మధ్య నడిచే వేర్వేరు ఆరు రైళ్లు జూన్ 27, 28, 29, జులై 1 తేదీల్లో.. సికింద్రాబాద్-సుభేదార్‌గంజ్ మధ్య నడిచే రైళ్లు జూన్ 27, 29 తేదీల్లో రద్దయ్యాయి. తెలంగాణ, దురంతో ఎక్స్‌ప్రెస్‌లను నిర్ణీత తేదీల్లో దారి మళ్లించి నడిపించనున్నారు.
కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్-న్యూఢిల్లీ (నం.12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్ మీదుగా మళ్లించనున్నారు. న్యూఢిల్లీ-సికింద్రాబాద్ (నం.12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీల్లో ముద్కేడ్, నిజామాబాద్ మీదుగా నడిపిస్తారు. సికింద్రాబాద్-నిజాముద్దీన్ (దిల్లీ), నిజాముద్దీన్-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను (నం.12285/12286) జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు.