iDreamPost
android-app
ios-app

ఆ తప్పు కారణంగా.. HYD మెట్రోకు రూ. 6 వేల ఫైన్

ఓ ప్రయాణికుడికి మెట్రో స్టేషన్ లో కలిగిన అసౌకర్యంతో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఫిర్యాదును విచారించిన కమిషన్ హైదరాబాద్ మెట్రోకు బాధితుడికి రూ.5వేల పరిహారం, కేసు ఖర్చులు రూ.1,000 చెల్లించాలని ఆదేశించింది.

ఓ ప్రయాణికుడికి మెట్రో స్టేషన్ లో కలిగిన అసౌకర్యంతో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఫిర్యాదును విచారించిన కమిషన్ హైదరాబాద్ మెట్రోకు బాధితుడికి రూ.5వేల పరిహారం, కేసు ఖర్చులు రూ.1,000 చెల్లించాలని ఆదేశించింది.

ఆ తప్పు కారణంగా.. HYD మెట్రోకు రూ. 6 వేల ఫైన్

హైదరాబాద్ మెట్రోకు ప్రయాణికుల నుంచి అపూర్వ ఆధరణ లభిస్తోంది. నిత్యం వేల మంది ప్రయాణిస్తున్నారు. కాలుష్య రహితం, సమయం ఆదా కావడంతో రోజు రోజుకి మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఆఫీసులకు వెళ్లే వారు, కార్మికులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరికి మెట్రో ప్రయాణం సౌకర్యవంతంగా మారిపోయింది. అయితే మెట్రో స్టేషన్లలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు ప్రయాణికులను అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో మెట్రోకు జరిమానాలు కూడా విధిస్తున్నాయి కన్య్జూమర్ కోర్టులు. ఇటీవలె హైదరాబాద్ మెట్రోకు రూ. 10 వేల ఫైన్ విధించగా ఇప్పుడు మరోసారి జరిమానా విధించింది.

ఓ ప్రయాణికుడికి మెట్రో స్టేషన్ లో కలిగిన అసౌకర్యంతో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఫిర్యాదును విచారించిన కమిషన్ హైదరాబాద్ మెట్రోకు బాధితుడికి రూ.5వేల పరిహారం, కేసు ఖర్చులు రూ.1,000 చెల్లించాలని ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే? సైదాబాద్‌కు చెందిన వృత్తి పరంగా న్యాయవాది అయిన షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌ 2022 డిసెంబర్‌ 16న దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి మలక్‌పేట్‌ వరకు మెట్రోలో ప్రయాణించారు. మలక్ పేట మెట్రో స్టేషన్‌లో దిగిన తర్వాత మలక్‌పేట్‌ రైల్వే స్టేషన్‌కు త్వరగా చేరుకోవాలని అక్కడ సైన్ బోర్డులను అనుసరిస్తూ కౌంటర్‌ వద్ద మెట్రో కార్డును ట్యాప్‌ చేశారు. సైన్ బోర్డును అనుసరిస్తూ వెళ్లిన అతడికి ఆ వైపు కాకుండా రైల్వేస్టేషన్‌ మార్గం మరోవైపు కనిపించింది.

దీంతో కాసేపు గందరగోళానికి గురయ్యాడు అబ్దుల్‌ ఖాదర్‌. మెట్రోస్టేషన్‌లో ఏర్పాటు చేసిన మూడు సైన్ బోర్డులు తప్పుడు దిక్కులు సూచిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాడు. మలక్ పేట మెట్రో స్టేషన్ లో అతడు ఉన్న వైపు నుంచి రైల్వే స్టేషన్ మార్గం వైపు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు. దీంతో అసహనానికి గురైన అబ్దుల్‌ ఖాదర్‌.. హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. మెట్రో స్టేషన్ లో తప్పుడు సైన్ బోర్డులతో ప్రయాణికుల సమయం వృథాతో పాటు ఇబ్బందికరంగా ఉంటుందని పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ హైదరాబాద్ మెట్రోకు రూ. 6 వేల ఫైన్ విధించింది.