iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు అలర్ట్.. అక్కడ 5 రోజులు విద్యాసంస్థలకు సెలవు

  • Published Sep 04, 2024 | 10:53 AM Updated Updated Sep 04, 2024 | 10:53 AM

గత నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. అయితే ఈ భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలన్ని నీట మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లే అవకాశం లేకపోవటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గత నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. అయితే ఈ భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలన్ని నీట మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లే అవకాశం లేకపోవటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

  • Published Sep 04, 2024 | 10:53 AMUpdated Sep 04, 2024 | 10:53 AM
విద్యార్థులకు అలర్ట్.. అక్కడ 5 రోజులు విద్యాసంస్థలకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో వాగులు, నదులు, చెరువులు పొంగిపోయి రహదారులన్ని జలమయమైయ్యాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతికి చాలామంది ప్రాణాలు సైతం పొగొట్టుకన్నారు. మరీ కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూడా కొట్టుకోపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి మాత్రం  వరుణుడు కాస్త శాంతించటంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ భారీ వర్షాలు, వరదలు ఎక్కువగా తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబు జిల్లాలో ప్రభావం చూపటంతో.. ఆయా ప్రాంతాలన్ని నీట మునిగాపోయాయి. దీంతో ప్రస్తుతం ఆయా జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు విద్యాంసంస్థలకు వెళ్లే అవకాశం లేకపోవటంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే…

గత నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని  ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబ్ జిల్లాల్లో కాలనీలు నీట మునిగాయి. దీంతో ప్రస్తుతం ఆయా  జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు విద్యాంసంస్థలకు వెళ్లే అవకాశం లేకపోవటంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించి, ఈమేరకు ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అయితే  జిల్లాలో భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా ఈ సెలవులు మంజూరు చేయటం జరుగుతుందన్నారు.

ఇక ఈ సెలవులు అనేవి సెప్టెంబర్ నేటి నుంచి సెప్టెంబర్ 6 (శుక్రవారం) వరకు ప్రకటించారు. అయితే సెప్టెంబర్ 7న వినాయక చవితి, సెప్టెంబర్ 8న ఆదివారం కావడంతో మళ్లీ తిరిగి విద్యా సంస్థలు సెప్టెంబర్ 9న తెరకుంటాయని తెలిపారు. ఇలా చూసుకుంటే.. ఖమ్మం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు 5 రోజులు సెలవులు ఉండనున్నాయి.  ఇకపోతే అన్ని విద్యాసంస్థల యాజమాన్యలు ఈ సెలవులు కచ్చితంగా పాటిస్తూ.. ఈ సమాచారాన్ని వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని కలెక్షర్ ఆదేశించారు. అంతేాకాకుండా.. మండల విద్యాధికారులు తమ పరిధిలోని అన్ని  యాజమాన్య పాఠశాలలకు విధిగా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రకటన జారీ చేశారు.