HYD హోటల్లో మండి బిర్యాని తిని.. 45 మందికి అస్వస్థత

స్నేహితులతో, కుటుంబ సభ్యులతో రెస్టారెంట్ కు వెళితే.. మండి కొత్తగా ఉందని ట్రై చేస్తున్నారు. లేదంటే ప్రత్యేకంగా మండి రెస్టారెంట్లకు వెళుతున్నారు. ఈ కల్చర్ ను క్యాష్ చేసుకుంటున్న రెస్టారెంట్లు మాత్రం.. వినియోగదారులకు మంచి ఫుడ్ అందించడం లేదు.

స్నేహితులతో, కుటుంబ సభ్యులతో రెస్టారెంట్ కు వెళితే.. మండి కొత్తగా ఉందని ట్రై చేస్తున్నారు. లేదంటే ప్రత్యేకంగా మండి రెస్టారెంట్లకు వెళుతున్నారు. ఈ కల్చర్ ను క్యాష్ చేసుకుంటున్న రెస్టారెంట్లు మాత్రం.. వినియోగదారులకు మంచి ఫుడ్ అందించడం లేదు.

వీకెండ్ వస్తే చాలు స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్స్, హోటల్స్‌కు వెళుతుంటారు. వారం అంతా ఉద్యోగాలతో బిజీ బిజీగా గడిపేస్తుండటంతో జస్ట్ ఫర్ ఛేంజ్ కోసం అలా ఫుడ్ ఆస్వాదిస్తుంటారు. వెళ్లగానే స్టారర్స్, తమకు ఇష్టమైనవీ ఆర్డర్ చేసుకుని ఆరగిస్తుంటారు. అయితే ఇటీవల రెస్టారెంట్లలోకి మండి కల్చర్ వచ్చి చేరింది. ప్రత్యేకంగా మండి రెస్టారెంట్లు కూడా వెలిశాయి. ఫ్రెండ్స్, బంధువులతో ఒకే ప్లేటులో తినేందుకు వీలుగా మండి ఆర్డర్స్ చేస్తుంటారు. డైనింగ్ వెరైటీగా ఉండటం, ఒకే చోట కూర్చుని భోజనం చేయడంతో పాటు ఎవరికీ ఇష్టమైనది వారు ఆర్డర్ చేసుకుంటే బిల్లు తడిసి మోపెడు అవుతున్న నేపథ్యంలో చాలా మంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు.

ఇవన్నీ చూస్తారు కానీ.. ఆ భోజనం శుభ్రంగా ఉందా లేదా అని మాత్రం పట్టించుకోరు. నాలుగు మసాలా దినుసులు వేసి.. నాలుగు రోజుల క్రితం బిర్యానీ పెట్టినా బ్రహ్మండంగా లొట్టలు వేసుకుని తింటుంటారు. ఆ తర్వాత సమస్యలు కొని తెచ్చుకుంటారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ మండి రెస్టారెంట్‌లో ఇలా భోజనం చేసి 45 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం ఫిర్యాదు రూపంలో అధికారులకు చేరడంతో ఆ మండి హోటల్‌ను మూసివేశారు. వివరాల్లోకి వెళితే.. ఎంఎస్ మండి రెస్టారెంట్‌లో తిన్న, ఇంటికి పార్శిల్ తీసుకెళ్లిన వారికి వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలొచ్చాయి. సుమారు 45 మంది అనారోగ్యం బారిన పడ్డారు. హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చేరారు.

ఈ ఘటనపై సామాజిక కార్యకర్త అజ్మత్ జాఫరీ అనే వ్యక్తి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంఎస్ మండిలో తనిఖీలు చేపట్టారు. నమూనాలను సేకరించి, విశ్లేషణకు పంపారు. అనంతరం ఆ హోటల్ ను మూసివేశారు. తదుపరి నోటీసు ఇచ్చేవరకు దీన్ని మూసివేయాలని యాజమాన్యానికి సూచించింది. పరిశుభ్రత పాటించడంలో విఫలమైనందుకు, ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంగించినందుకు గానూ యాజమాన్యంపై మిర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి రెస్టారెంట్లకు వెళ్లి.. ఇలా ఎప్పుడైనా అవస్థలు పడి ఉంటే ఆ అనుభవాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments