iDreamPost
android-app
ios-app

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. వారందరికీ 30 లక్షలు

Singareni Contract Employees: సింగరేణి సంస్థ కార్మికులకు శుభవార్తను అందించింది. కాంట్రాక్ట్ కార్మికులందరికీ రూ. 30 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది.

Singareni Contract Employees: సింగరేణి సంస్థ కార్మికులకు శుభవార్తను అందించింది. కాంట్రాక్ట్ కార్మికులందరికీ రూ. 30 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది.

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. వారందరికీ 30 లక్షలు

సింగరేణి ద్వారా వేలాది మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి సంస్థ కీలక చర్యలు చేపడుతున్నది. ఇటీవల కారుణ్య నియామకాల కోసం వయోపరిమితిని పెంచిన విషయం తెలిసిందే. తాజాగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు శుభవార్తను అందించింది. ప్రమాదాలకు గురైనప్పుడు భారీ స్థాయిలో ప్రమాద బీమా కల్పించేందుకు రెడీ అయ్యింది. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రూ. 30 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు 25 వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధి కలుగనున్నది.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఈ బీమా పొందాలంటే హెచ్ డీ ఎఫ్సీ శాలరీ అకౌంట్ కలిగి ఉండాలని సంస్థ చైర్మన్‌, ఎండీ బలరామ్‌ ప్రకటించారు. ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి బీమా అమలవుతుందని తెలిపారు. సింగరేణి భవన్‌లో ఆయన ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రమాద బీమా సదుపాయం వర్తింపజేసేందుకు ప్రతీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సాలరీ అకౌంట్‌ కలిగి ఉండేలా ఏరియా జీఎంలు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఇప్పటికే సింగరేణి ఉద్యోగుల కోసం ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌ల ద్వారా రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం కోసం హెచ్‌డీఎఫ్‌సీతోనూ ఒప్పందం చేసుకుని రూ.30లక్షల ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు ఎండీ బలరామ్‌ తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక భద్రత చర్యల్లో భాగంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నామని.. వారి కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య సేవలు అందించేందుకు ఈఎస్ఐ ఆసుపత్రుల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.