iDreamPost
android-app
ios-app

26 మంది IASల బదిలీ.. స్మితా సబర్వాల్ పై బదిలీ వేటు!

Telangana: తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. దాదాపు 26 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీప్ సెక్రటరీ ఉత్తర్వూలు జారీ చేశారు. ఈ బదిలీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కూడా ఉన్నారు.

Telangana: తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. దాదాపు 26 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీప్ సెక్రటరీ ఉత్తర్వూలు జారీ చేశారు. ఈ బదిలీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కూడా ఉన్నారు.

26 మంది IASల బదిలీ.. స్మితా సబర్వాల్ పై బదిలీ వేటు!

ప్రభుత్వ అధికారుల బదిలీలు అనేది సర్వసాధారణంగా జరిగేది. అయితే కొన్నిసార్లు భారీగా ఐఏఎస్,ఐపీఎస్ ల బదిలీలు జరుగుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో పోస్టింగ్స్ విషయంలో అనేక సంచలన, ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీగా  తొలిసారిగా భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఇదే సమయంలో అందరు ఆసక్తిగా ఎదురు చూసిన ఓ అంశంపై కూడా క్లారీటి వచ్చింది. ఈ బదిలీల్లో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కి స్థాన చలనం అయ్యింది. మరి.. ఈ బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం…

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 26 మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ, పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే సీఎస్ తరువాత కీలకమైన సీఎంవో సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డిని నియమించింది. ఇక తాజాగా బదిలీ అయిన వారిలో సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, మహబూబాబాద్, గద్వాల జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్వీతా సబర్వాల్ పై కూడా బదిలీ వేటు పడింది. సీఎంఓ ఛీప్ సెక్రటరీగా ఉన్న స్మితను.. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు.

అధికారుల బదిలీల వివరాలు ఇవే:

  • ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జను నియమించారు.
  • నల్గొండ కలెక్టర్‌గా దాసరి హరిచందన నియమించారు.
  • సంగారెడ్డి కలెక్టర్ గా వల్లూరు క్రాంతి.
  • గద్వాల కలెక్టర్ గా బీఎం సంతోష్ ను నియమించారు.
  • మైన్స్ అండ్ జియోలజి ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ ధత్ ఎక్కా బాధ్యతలు అప్పగించారు.
  • ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్ నియామకం.
  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా దివ్యాని నియమించారు.
  • పురావస్తు శాఖ డైరెక్టర్ గా భారతి హోలికేరిను ఎంపిక చేశారు.
  • గిరిజిన సంక్షేమ ఎండీగా చిత్తం లక్ష్మి.
  • మహబూబాబాద్ కలెక్టర్ గా కుమార్ సింగ్ ను నియమించారు.
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా శశాంకను నియమించారు.
  • టీఎస్ డైరీ కార్పొరేషన్ ఎండీగా చిట్టెం లక్ష్మిని నియమించారు
  • కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యా
  • జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా అభిలాష్ అభినవ్ ను నియమించారు.
  • ఆయుష్ డైరెక్టర్ గా ఎం. ప్రశాంతి
  • ఆర్థిక, ప్రణాళిక ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ భాస్కర్ ను నియమించారు.
  • పంచాయతీ రాజ్, ఆర్డీ కార్యదర్శిగా సందీప్ కుమార్  సల్తానియాను నియమించారు.

అంతేకాక మరికొంత మంది ఐఏఎస్ లకు వివిధ శాఖల్లో, వివిధ విభాగాల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. అయితే ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన రామకృష్ణ రావుకు ఎలాంటి పోస్ట్ ను ప్రభుత్వం కేటాయించలేదు. మరి.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ బదిలీలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.