iDreamPost

తెలంగాణ పోలీసుల అరుదైన ఘనత! ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల..

శాంతి భద్రతలు, సైబర్ క్రైమ్ కేసులను ఛేదించే క్రమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పోలీసులు అరుదైన ఘనత సాధించారు. ఆ వివరాల్లోకి వెళితే..

శాంతి భద్రతలు, సైబర్ క్రైమ్ కేసులను ఛేదించే క్రమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పోలీసులు అరుదైన ఘనత సాధించారు. ఆ వివరాల్లోకి వెళితే..

తెలంగాణ పోలీసుల అరుదైన ఘనత! ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల..

శాంతి భద్రతలు, సైబర్ క్రైమ్ కేసులను ఛేదించే క్రమంలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక విధుల్లో నిబద్ధత, వృత్తిపట్ల ఉన్న కమిట్ మెంట్.. చురుకుదనం లాంటి లక్షణాలతో మరోసారి సూపర్ పోలీస్ అనిపించుకున్నారు తెలంగాణ పోలీసులు. తాజాగా రాష్ట్ర పోలీసులు అరుదైన ఘనతను సాధించారు. ఐక్యరాజ్య సమితి ద్వారా వివిధ దేశాల్లో నియమించే పీఎస్ కమిషన్ శాంతి భద్రతల విధులు నిర్వహించేందుకు రాష్ట్రం నుంచి 19 మంది అధికారులు ఎంపిక అవ్వడం గర్వకారణం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

తెలంగాణ పోలీసులు అరుదైన ఘనత సాధించారు. ఐక్యరాజ్య సమితి ద్వారా వివిధ దేశాల్లో నియమించే పీఎస్ కమిషన్ శాంతి భద్రతల విధులు నిర్వహించేందుకు జరిగిన పరీక్షల్లో రాష్ట్ర పోలీసులు సత్తాచాటారు. ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి మెుత్తం 22 మంది అధికారులు హాజరవగా.. అందులో 19 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 19 మంది అంతర్గతంగా శాంతి భద్రతలు లోపించిన దేశాల్లో ఏడాది పాటు విధులు నిర్వహించి.. అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తారు. ఈ పరీక్షలను న్యూయార్క్ నుంచి వచ్చిన పోలీసులు చేపట్టారు.

Telanagana Police

ఢిల్లీలో జూన్ 6 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించారు. ఇంగ్లీష్, డ్రైవింగ్, ఫైరింగ్ వంటి విభాగాల్లో నిర్వహించిన ఎగ్జామ్స్ కు దేశవ్యాప్తంగా 225 మంది హాజరవగా.. అందులో 164 మంది ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి 19 మంది ఉండటం గర్వకారణం. రాష్ట్ర పోలీసులు ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల విధులకు ఎంపిక అవ్వడంతో తెలంగాణ పోలీస్ శాఖకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ఐరాస శాంతి భద్రతల విధులకు ఎంపికైన తెలంగాణ పోలీస్ అధికారులు వీరే:

  • అలెక్స్, కమాండెంట్
  • దేవేందర్ సింగ్, ఎస్పీ
  • చల్లా శ్రీధర్, డీఎస్పీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో
  • నర్సింగ్ రావు డీఎస్పీ, యాంటీ నార్కోటిక్ బ్యూరో
  • ప్రతాప్, డీఎస్పీ విజిలెన్స్ విభాగం
  • కే.ఎం.కిరణ్ కుమార్, ఏసీబీ, హైదరాబాద్ సీసీఎస్
  • శ్రీధర్ రెడ్డి, డీఎస్పీ, కోదాడ
  • జూపల్లి రమేశ్, ఏసీపీ
  • మాజిద్ అలీ ఖాన్, ఏసీపీ
  • సురేశ్, ఇన్‌స్పెక్టర్, సైబరాబాద్
  • విజయ్ కుమార్, సీఐడీ, ఇన్‌స్పెక్టర్
  • శ్రీనివాసులు, హెడ్ కానిస్టెబుల్
  • యాదగిరి, హెడ్ కానిస్టెబుల్, అలేరు పీఎస్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి