iDreamPost
android-app
ios-app

రియల్‌ లైఫ్‌ సార్‌.. ఆయన కోసం 133 మంది విద్యార్థులు ఏం చేశారంటే..

  • Published Jul 04, 2024 | 12:15 PM Updated Updated Jul 04, 2024 | 12:15 PM

సాధారణంగా చాలా కాలం పాటు ప్రభుత్వ స్కూల్లలో పనిచేసిన టీచర్స్ బదిలీ అవుతూ వేరే స్కూల్స్ కు వెళ్లడం చాలా కామన్. ఇక ఆ సమయంంలో తమకు చదువు చెప్పిన గురువు వెళ్లిపోతున్నందుకు చాలామంది విద్యార్థులు ఎమోషనల్ అవుతుండటం చూస్తూ ఉంటాం.ఇక అటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే చోటు చేసుకున్నాయి. కానీ, తాజాగా మంచిర్యాల జిల్లాలో మాత్రం ఓ స్కూల్ టీచర్ బదిలీపై మరో స్కూల్‌కు వెళ్తుంటే.. అక్కడ విద్యార్థులు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

సాధారణంగా చాలా కాలం పాటు ప్రభుత్వ స్కూల్లలో పనిచేసిన టీచర్స్ బదిలీ అవుతూ వేరే స్కూల్స్ కు వెళ్లడం చాలా కామన్. ఇక ఆ సమయంంలో తమకు చదువు చెప్పిన గురువు వెళ్లిపోతున్నందుకు చాలామంది విద్యార్థులు ఎమోషనల్ అవుతుండటం చూస్తూ ఉంటాం.ఇక అటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే చోటు చేసుకున్నాయి. కానీ, తాజాగా మంచిర్యాల జిల్లాలో మాత్రం ఓ స్కూల్ టీచర్ బదిలీపై మరో స్కూల్‌కు వెళ్తుంటే.. అక్కడ విద్యార్థులు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Jul 04, 2024 | 12:15 PMUpdated Jul 04, 2024 | 12:15 PM
రియల్‌ లైఫ్‌ సార్‌.. ఆయన కోసం 133 మంది విద్యార్థులు ఏం చేశారంటే..

సాధారణంగా కొన్ని సందర్భాల్లో బయట జరిగిన కొన్ని యాదార్థ సంఘటనలు అచ్చం సినిమా కథను తలపించేలా ఉంటాయి. అయితే సినిమాల్లో జరిగే కొన్ని సంఘటనలు వాస్తవానికి మంచివైనా, చెడ్డవైనా సరే.. కొందరి నిజ జీవితానికి దగ్గరగా అనిపిస్తుందటాయి.అంతేకాకుండా..రీల్ లో చూపించే కొన్ని కథలు..రియల్ లైఫ్ లో కొందరికి ఆదర్శంగా చూపించేలా ఉంటాయి.అయితే ఇప్పుడి ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా.. మరెమీ లేదు. మీరు తమిళ్ హీరో ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సార్ చూశారా.. అందులో హీరో ధనుష్ ఓ కాలేజీ లెక్చరర్ గా నటిస్తారు. ఇక కాలేజీకి వచ్చే విద్యార్థులకు ఎంతో ప్రేమగా పాఠాలు చెప్పి వాళ్లని ఫస్ట్ క్లాస్ లో పాసయ్యేటట్లు చేస్తారు. ఇక ఈ చిత్రంలోనే వచ్చే కొన్ని సన్నివేశాలైతే చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఇలా విద్యార్థులలు స్థాయికి వెళ్లాలంటే గురవు ఇలాగే ఉండాలి అనే విధంగా ఉంటుంది ధనుష్ నటించిన రీల్ స్టోరి కథ. కానీ, నిజంగా రీయల్ లైఫ్ లో అలాంటి సార్ కూడా ఒకరు ఉన్నారు. ఇక ఆ సార్ ని ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా 133 మంది పిల్లలు అమితంగా ఇష్టపడుతున్నారు. కేవలం ఆయన పాఠాలు చెప్పిన స్కూల్ నుంచి బదిలీ అవుతున్నాడని తెలిసి ఆ విద్యార్థలు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మంచిర్యాల జిల్లాలో రియల్ లైఫ్ లోని ఓ మాస్టార్ అచ్చం సార్ మూవీలో ధనుష్ చేసిన రోల్ కు తగ్గట్టుగా ఉంటారు. అసలు ఓ సార్ అంటే ఈ విధంగా ఉండాలి అని చూపించేందుకు ఆయనను ఆదర్శంగా తీసుకొవచ్చు. అయితే సాధారణంగా ఏ ప్రభుత్వ పాఠశాలలోనైనా బదీలు చాల కామన్. అయితే సహజంగా చాలా కాలం పాటు అక్కడ పని చేసిన స్కూల్ టీచర్లు బదిలీపై వెళ్తుంటే.. చాలామంది పిల్లలు ఎమోషనల్ అవుతుండటం చూస్తూ ఉంటాం.ఇక అటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే చోటు చేసుకున్నాయి. కానీ, తాజాగా మంచిర్యాల జిల్లాలో మాత్రం ఓ స్కూల్ టీచర్ బదిలీపై మరో స్కూల్‌కు వెళ్తుంటే.. విద్యార్థులు సైతం ఆయన బాటలోనే నడిచారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా వంద మందికి పైగా విద్యార్థులు తమ గురవు వెళ్లిన స్కూల్‌లోనే అడ్మిషన్ తీసుకున్నారు. ఇంతకి ఆ సార్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మంచిర్యాల జన్నారం మండలం పొనకల్‌ ప్రాథమిక పాఠశాలలో జాజాల శ్రీనివాస్ 2012లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా చేరారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. అయితే అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. శ్రీనివాస్ జాయిన్ అయ్యే సమయానికి అక్కడ ఐదు తరగతులకు గాను ఇద్దరు టీచర్లు, 32 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు.ఇకపోతే శ్రీనివాస్ పిల్లలతో చాలా ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించేవాడు. అంతేకాకుండా.. అక్కడ ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు. దీంతో గ్రామంలోని మిగిలిన తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపించటం మానేసి ప్రభుత్వ స్కూల్‌లోనే చేర్పించేవారు. దీంతో పొనకల్ ప్రైమరీ స్కూల్‌లో ఇప్పుడు విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 250కి చేరింది. కానీ, అనుకోకుండా శ్రీనివాస్ కు ఈనెల 1వ తేదీన ఇదే మండలంలోని అక్కపెల్లిగూడ స్కూల్‌కు బదిలీ అయ్యారు.

అయితే పొనకల్ స్కూల్‌కి అక్కపెల్లిగూడ స్కూల్‌కు 3.కి.మీ దూరం ఉంటుంది. ఇక తమకెంతో ఇష్టమైన సార్ బదిలీ కావటాన్ని పిల్లలు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే.. సార్ ఎక్కడుంటే మేం కూడా అక్కడే చదువుతామని విద్యార్థులు పట్టుబడ్డారు. దీంతో ఈనెల 2, 3 తేదీల్లో ఏకంగా 133 మంది పిల్లలు అక్కపెల్లిగూడ బడిలో చేరారు. అయితే జూన్‌ 30 వరకు అక్కపెల్లిగూడ స్కూల్‌లో కేవలం 21 మంది స్టూడెంట్స్ ఉండగా.. ఇప్పుడు 154 మందితో కళకళలాడుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు ఆశ్చర్యపోతూ.. గురవు అంటే ఇలాగే ఉండాలని అని అతని పై ప్రశంసలు కురిపించారు.మరి, ఉపాధ్యాయుడు బదీలి అవ్వడంతో.. విద్యార్థులు కూడా అతని బాటలో నడవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.