iDreamPost

ఇదేం దారుణం.. ముందు ఫెయిల్.. రివాల్యేషన్ లో 90 శాతం మార్కులు..!

పదో తరగతి పరీక్ష పత్రాలను దిద్దడంలో కొందరు టీచర్ల నిర్లక్ష్యంగా  ఉంటారు. దీంతో వారు చేసిన పనికి విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

పదో తరగతి పరీక్ష పత్రాలను దిద్దడంలో కొందరు టీచర్ల నిర్లక్ష్యంగా  ఉంటారు. దీంతో వారు చేసిన పనికి విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ఇదేం దారుణం.. ముందు ఫెయిల్.. రివాల్యేషన్ లో 90 శాతం మార్కులు..!

విద్యా అనేది ప్రతి ఒక్కరి చాలా విలువైంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని భావించి..రేయింబవళ్లు కష్టపడుతుంటారు. అలా తాము సంపాదించిన డబ్బులతో పిల్లలకు మంచి విద్యను అందిస్తుంటారు. అలానే విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించేందుకు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని భావిస్తారు. కానీ పరీక్ష పేపర్లు దిద్దే వారిలో కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

పదో తరగతి పరీక్ష పత్రాలను దిద్దడంలో కొందరు టీచర్ల నిర్లక్ష్యంగా  ఉంటారు. దీంతో వారు చేసిన పనికి విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇటీవలే వాల్యూయేషన్లో నిర్లక్ష్యం కారణంగా ఓ పదో తరగతి విద్యార్థిని తొలుత ఫెయిల్ అయినట్లు చూపించారు. అయితే తాను ఫెయిల్ అయ్యే వ్యక్తిని కాదని నమ్మిన ఆ విద్యార్థి రివాల్యూయేషన్ పెట్టగా ఏకంగా 90 శాతం మార్కులు సాధించింది. దీంతో టీచర్ల నిర్లక్ష్యం బయటబయలైంది.

తెలంగాణ  రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని సూరారం కాలనీకి  చెందిన చెజెర్ల శ్రీనివాస్, శ్రీదేవిలు దంపతుల లతశ్రీ అనే కుమార్తె ఉంది. ఆ పాప రాజీవ్ గాంధీ నగర్ లోని గీతాంజలి స్కూల్లో 10వ  చదివింది. అలానే ఇటీవల పదో తరగతి పరీక్షలను రాసింది.  అనంతరం వచ్చిన ఫలితాల్లో లతశ్రీ ఇంగ్లిష్ లో ఫెయిల్ అయినట్లుగా వచ్చింది. దీంతో లతశ్రీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు షాకి గురయ్యారు. తాను ఎంతో కష్టపడ్డానని, 9.5 గ్రేడ్ సాధిస్తానని నమ్మకముందని  విద్యార్థి చెప్పింది. అంతేకాక తనకు వచ్చిన ఫలితాలను చూసుకుని ఆ విద్యార్థిని తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బాలిక పరిస్థితిని చూసి ఆవేదన చెందిన ఆ పాప తల్లిదండ్రులు విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన లతశ్రీకి కౌన్సిలింగ్ నిర్వహించారు.

అంతేకాక తల్లిదండ్రులతో కలిసి లతశ్రీ ఫెయిల్ అయినా  ఇంగ్లీష్ సబ్జెక్టు రీవ్యాలుయేషన్ పెట్టించారు. తొలుత విడుదలైన ఇంగ్లిష్ సబ్జెక్ట్  26 మార్కులే వచ్చాయి. అయితే తిరిగి రివాల్యుయేషన్ చేయించగా 80కి 74 మార్కులు వచ్చాయి.  మొత్తంగా 9.3 గ్రేడ్ తో ఉత్తీర్ణత సాధించింది. తొలుత ఫెయిల్ అయి.. రివాల్యూయేషన్ లో 90 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పేపర్లు దిద్దిన వారిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇలా విద్యార్థుల జీవితంతో ఆటలాడుకునే టీచర్లను శిక్షించాలనే పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏమి చేయాలి.?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి