iDreamPost
android-app
ios-app

వాట్సాప్‌ వీడియో కాల్‌ మరింత స్పెషల్‌గా.. మీ లుక్‌ని రియల్‌టైమ్‌లోనే మార్చేయొచ్చు!

  • Published Aug 29, 2024 | 11:52 AM Updated Updated Aug 29, 2024 | 11:52 AM

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. వీడియో కాల్ ను మరింత స్పెషల్ గా మార్చుకోవచ్చు. మీ లుక్‌ని రియల్‌టైమ్‌లోనే మార్చేయొచ్చు. ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. వీడియో కాల్ ను మరింత స్పెషల్ గా మార్చుకోవచ్చు. మీ లుక్‌ని రియల్‌టైమ్‌లోనే మార్చేయొచ్చు. ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌ వీడియో కాల్‌ మరింత స్పెషల్‌గా.. మీ లుక్‌ని రియల్‌టైమ్‌లోనే మార్చేయొచ్చు!

వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది వాట్సాప్. ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. యూజర్ల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పలు సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెడుతున్నది. వాట్సాప్ యాప్ అందుబాటులోకి వచ్చాక సమాచారం చేరవేసుకోవడం ఈజీ అయిపోయింది. ఇప్పుడు యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తుంది. వాట్సాప్ లో వీడియో కాల్ మరింత స్పెషల్ గా మార్చుకోవచ్చు. మీ లుక్ ను రియల్ టైమ్ లోనే మార్చేయొచ్చు. ఎలా అంటే?

వాట్సాప్ లో ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో చాటింగ్, నార్మల్ కాల్, వీడియో కాల్ చేస్తుంటారు. ఇటీవల ఆఫీస్ గ్రూప్ మీటింగ్స్ కోసం కూడా వాట్సాప్ ను యూజ్ చేస్తున్నారు. ఇక వీడియో కాల్ స్పెషల్ గా మలుచుకునేందుకు వాట్సాప్‌ వీడియో కాల్స్‌లో ఏఆర్‌ ఎఫెక్ట్‌లు తీసుకురానుంది. దీంతో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు మీకు కావాల్సిన లుక్ లో సెట్ చేసుకోవచ్చు. అంటే మీ లుక్‌ని రియల్‌టైమ్‌లోనే మార్చేయొచ్చన్నమాట! ఇందుకోసం ఫేషియల్ ఫిల్టర్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ఫీచర్ తో వీడియో కాల్ సూపర్ స్పెషల్ గా మారనున్నది.

వాట్సాప్ తీసుకురానున్న ఏఆర్ ఎఫెక్టులతో మీ స్కిన్‌ కలర్‌ టోన్‌ మార్చేయొచ్చు. మీరున్న లొకేషన్‌, చుట్టూ ఉన్న లైటింగ్‌కు తగినట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌ ఎడిటింగ్‌ టూల్‌ తో బ్యాక్‌గ్రౌండ్‌లో మార్పులు చేర్పులు చేయొచ్చు. ఆఫీస్ మీటింగ్ కాల్ వచ్చినప్పుడు దానికి తగినట్టుగా, ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు సరదాగా మీకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ ను పెట్టుకోవచ్చు. వీటిని ప్రీసెట్‌ బ్యాక్‌గ్రౌండ్స్‌ గా పిలుస్తున్నారు. తక్కువ వెలుతురు ఉన్నట్టయితే.. లోలైట్‌ మోడ్‌ ని సెలెక్ట్‌ చేసుకొని లైటింగ్‌ అడ్జెస్ట్‌ చేసుకునే వీలుంది. టచ్ అప్ మోడ్ ఆప్షన్ తో వీడియో కాల్ లో మరింత అందంగా కనిపించొచ్చు. ఈ ఫీచర్‌ యాపిల్‌ యూజర్లకు బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది.