P Venkatesh
కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు టక్కుమని గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్. దీని సాయంతో వెళ్లాల్సిన గమ్యానికి సంబంధించిన మార్గాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. మరి గూగుల్ మ్యాప్ లో మీ ఇంటిని కూడా యాడ్ చేసుకోవచ్చు.
కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు టక్కుమని గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్. దీని సాయంతో వెళ్లాల్సిన గమ్యానికి సంబంధించిన మార్గాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. మరి గూగుల్ మ్యాప్ లో మీ ఇంటిని కూడా యాడ్ చేసుకోవచ్చు.
P Venkatesh
గూగుల్ మ్యాప్.. ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ సాయంతో ప్రపంచంలోని ఏ ప్రదేశాన్ని అయినా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒకప్పుడు ఏదైనా అడ్రస్ కావాలంటే తెలిసిన వారిని అడిగి వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ప్రఖ్యాత టెక్ కంపెనీ గూగుల్ అందించే గూగుల్ మ్యాప్ యాప్ ద్వారా తెలియని ప్రాంతాన్ని, వెళ్లాల్సిన గమ్యాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. నగరాల్లో గూగుల్ మ్యాప్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. బైక్ ట్యాక్సీ వాళ్లు, ఫుడ్ డెలివరీ పర్సన్స్ గూగుల్ మ్యాప్ సాయంతోనే కస్టమర్ల వద్దకు చేరుకుంటున్నారు. మరి ఈ గూగుల్ మ్యాప్ లో మీ ఇంటిని లేదా స్థలాన్ని జోడించాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి.
గూగుల్ మ్యాప్ లో మీరు వెళ్లాలనుకున్న ప్రాంతం వివరాలను ఎంటర్ చేస్తే ఈజీగా అక్కడికి తీసుకెళ్తుంది. వాహనదారులకు గూగుల్ మ్యాప్ అందుబాటులోకి వచ్చాక ప్రయాణం సులభమైపోయింది. దాదాపు ఇంకొకరి అవసరం లేకుండానే గమ్యానికి చేరుకునే వీలు ఏర్పడింది. ఇంటి అడ్రస్ తో ఇబ్బంది పడే వాళ్లు గూగుల్ మ్యాప్ లో యాడ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అయితే గూగుల్ మ్యాప్ లో మీ స్థలం, మీ పేరు, మీ వీధి, మీ ఇంటి సమాచారాన్ని యాడ్ చేసుకోవచ్చు.