Vinay Kola
Yamaha R15M: యమహా కంపెనీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త R15M బైక్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైక్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి.
Yamaha R15M: యమహా కంపెనీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త R15M బైక్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైక్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి.
Vinay Kola
యమహా కంపెనీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త R15M బైక్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైక్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి కొత్త కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్ కాగా ఇంకొకటి మెటాలిక్ గ్రే. వీటిలో రైడర్లకు నచ్చే విధంగా కొత్త ఫీచర్లని కూడా చేర్చింది యమహా కంపెనీ.. ఈ బైక్ లో టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్ ఉంటుంది. అలాగే మ్యూజిక్, వాల్యూమ్ కంట్రోల్ ఫంక్షన్‌లు ఉంటాయి.. ఇక ఈ ఫంక్షన్లను Y-కనెక్ట్ అప్లికేషన్ ద్వారా వాడవచ్చు. ఈ అప్లికేషన్ ని గూగుల్ ప్లే స్టోర్, iOS.. App Storeలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ బైక్‌ను కనెక్ట్ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చెయ్యాలి. ఈ బైక్ అదిరిపోయే స్విచ్ గేర్, కొత్తగా డిజైన్ చేసిన ఎల్ఈడీ లైసెన్స్ ప్లేట్ లైట్ తో వస్తుంది.
ఈ బైక్ 155 cc ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ మాక్సిమం 7,500 rpm వద్ద 14.2 Nm మాక్సిమం టార్క్ ని జనరేట్ చేస్తుంది. అలాగే 10,000 rpm వద్ద 18.10 bhp మాక్సిమం పవర్ ని జనరేట్ చేస్తుంది. అలాగే ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఈ బైకులో స్లిప్, అసిస్ట్ క్లచ్, క్విక్‌షిఫ్టర్ కూడా ఈ బైకులో ఉన్నాయి. అలాగే ఈ బైక్.. యమహా ట్రాక్షన్ కంట్రోల్ కలిగి ఉంది. R15M బైక్ కార్బన్ ఫైబర్ డిజైన్ తో తయారు చేశారు. ఈ బైక్ ని వాటర్ డిప్పింగ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. ఈ డిజైన్ ఫ్రంట్ కౌల్, సైడ్ ఫెయిరింగ్.. వెనుక వైపు ప్యానెల్‌లపై ఉంటుంది.
ఇక ఈ బైక్ కి ఆల్-బ్లాక్ ఫెండర్, ట్యాంక్‌పై కొత్త డీకాల్స్, సైడ్ ఫెయిరింగ్ అలాగే బ్లూ వీల్స్ కూడా ఉన్నాయి. ఇవి చూడటానికి అదిరిపోయే లుక్ ని ఇస్తాయి. ఈ బైక్ ధర విషయానికి వస్తే.. మెటాలిక్ గ్రే R15M ఎక్స్ షోరూం ధర రూ.1,98,300 ఉంటుంది.. ఇక కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ ధర అయితే రూ.2,08,300 ఉంటుంది. ఈ బైక్ కచ్చితంగా రైడర్లకు అదిరిపోయే రైడింగ్ అనుభూతిని ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా కాలేజి కుర్రాళ్లని ఈ బైక్ చాలా బాగా ఆకట్టుకుంటుందట. ఇక ఈ సరికొత్త R15M బైక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.