P Venkatesh
Redmi pad pro 5g: కొత్త ట్యాబ్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే షావోమీ కంపెనీ సరికొత్త ట్యాబ్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది. క్రేజీ ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే లభ్యమవుతున్నది.
Redmi pad pro 5g: కొత్త ట్యాబ్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే షావోమీ కంపెనీ సరికొత్త ట్యాబ్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది. క్రేజీ ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే లభ్యమవుతున్నది.
P Venkatesh
ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను వాడే వారి సంఖ్య ఎక్కువైపోయింది. ఆఫీస్ వర్క్ కోసం, ఆన్ లైన్ క్లాస్ ల కోసం ల్యాప్ టాప్, ట్యాబ్ లను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ లో బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ట్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి అధిక ధరల కారణంగా కొనేందుకు ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. బడ్జెట్ ధరలో సరికొత్త ట్యాబ్ మార్కెట్ లోకి లాంఛ్ అయ్యింది. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ షావోమీ భారత్ లో కొత్త ట్యాబ్లెట్ ను రిలీజ్ చేసింది. రెడ్ మీ ప్యాడ్ ప్రొ 5జీ పేరిట మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధర ఎంతంటే?
మీరు ఈ మధ్యకాలంలో కొత్త ట్యాబ్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారా? బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ట్యాబ్ మంచి ఫీచర్లు ఉండాలని చూస్తున్నారా? అయితే షావోమీ తీసుకొచ్చిన న్యూ ట్యాబ్ మీకు బెస్ట్ ఆప్షన్. షావోమీకి చెందిన రెడ్ మీ ప్యాడ్ ప్రో 5జీ ట్యాబ్లెట్ తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ట్యాబ్ మిస్ట్ బ్లూ, క్విక్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది. రెడ్‌మీ ప్యాడ్ ప్రో 5జీ 2.5కే రెజల్యూషన్‌తో కూడిన 12.1 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ తో వస్తోంది. ఈ డిస్‌ప్లే 68.7 బిలియన్ రంగులు, డాల్బీ విజన్, 120హెచ్ జెడ్ రీఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తుంది.
ఈ ట్యాబ్ కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌ను ఇచ్చారు. 8ఎంపీ కెమెరాను అందించారు. 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 10,000ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపర్చారు. స్టీరియో స్పీకర్ సిస్టమ్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్. వైఫై 6, బ్లూటూత్ 5.2 వంటి ఆప్షన్లు ఉన్నాయి. సెల్యూలార్ సపోర్ట్ కూడా ఉండడం గమనార్హం. రెడ్‌మీ ప్యాడ్ ప్రో 5జీ 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్లతో వస్తుంది.