iDreamPost
android-app
ios-app

ఎండాకాలంలో ఫోన్ ఛార్జింగ్ స్లో అవుతుంది.. దీనికి కారణం ఏంటంటే?

  • Published Apr 29, 2024 | 6:52 PM Updated Updated Apr 29, 2024 | 6:52 PM

మిగతా రోజుల్లో కంటే వేసవికాలంలో స్మార్ట్ ఫోన్లు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్లు అయినా గానీ వేగం తగ్గుతుంది. దీనికి కారణం ఏంటంటే?

మిగతా రోజుల్లో కంటే వేసవికాలంలో స్మార్ట్ ఫోన్లు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్లు అయినా గానీ వేగం తగ్గుతుంది. దీనికి కారణం ఏంటంటే?

ఎండాకాలంలో ఫోన్ ఛార్జింగ్ స్లో అవుతుంది.. దీనికి కారణం ఏంటంటే?

ప్రతి ఏటా ఎండాకాలం దాని ప్రతాపం చూపిస్తుంది. ఏటేటా ఎండలు మండిపోతున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఎండలు ఎక్కువయ్యాయి. ఈ ఎండలకు మనుషులమే కాదు.. మన ఫోన్లు కూడా హీటెక్కిపోతున్నాయి. వీడియో చూసినా.. ఏదైనా వీడియో రికార్డ్ చేసినా.. గేమ్స్ ఆడినా ఫోన్ ఇట్టే హీట్ ఎక్కిపోతుంది. అంతేకాదు.. ఛార్జింగ్ కూడా మిగతా సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ లో స్లోగా ఎక్కుతుంది. ఈ సమ్మర్ కి, ఛార్జింగ్ కి ఏం సంబంధం ఉంది? ఎందుకిలా ఫోన్ స్లోగా ఛార్జ్ అవుతుంది అంటే దీనికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. స్మార్ట్ ఫోన్లలో ఉండే డిఫెన్స్ మెకానిజం. స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్ ఎలా అయితే పెరిగిందో.. అదే రేంజ్ లో ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్ కూడా చాలా పెరిగింది. నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ ఎక్కేలా టెక్నాలజీ వచ్చింది.

అయితే ఈ స్మార్ట్ ఫోన్లను యూజర్ టేస్ట్ కి తగ్గట్టు పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నారు. వేగంలో, పెర్ఫార్మెన్స్ లో.. డిస్ ప్లే విషయంలో ఇలా చాలా అంశాల్లో స్మార్ట్ ఫోన్లలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. అయితే ఈ మార్పులన్నీ ఫోన్ హీట్ కి కారణాలే. దీనికి తోడు హై ఎండ్ గేమ్స్ ఆడడం వల్ల ఫోన్ మరింత వేడెక్కుతుంది. మామూలు రోజుల్లో కంటే కూడా వేసవి రోజుల్లో ఈ వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి ఇలా ఉండగా ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తే.. ఆ వేగానికి ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది. అందుకే ఫోన్ లో డిఫెన్స్ మెకానిజంని డెవలప్ చేస్తారు.

ఫోన్ బాగా హీటెక్కినప్పుడు ఫోన్ లో ఉండే సెన్సార్లు గుర్తిస్తాయి. ఈ సెన్సార్లు ఫోన్ ఛార్జింగ్ వేగాన్ని తగ్గిస్తాయి. ఈ హీట్ టెంపరేచర్ సాధారణ స్థితికి వచ్చాక అప్పుడు ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. కొన్నిసార్లు అయితే స్మార్ట్ ఫోన్ టెంపరేచర్ సాధారణ స్థితికి చేరుకునేవరకూ పూర్తిగా ఫోన్ ఛార్జింగ్ అనేది ఎక్కదు. ఇలాంటప్పుడు ఫోన్ హీటెక్కితే ఫోన్ బ్యాక్ కేస్ తీసేయడం మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో వైర్ లెస్ ఛార్జింగ్ కంటే వైర్ ఛార్జింగ్ పెట్టడమే మంచిది. వైర్ లెస్ ఛార్జింగ్ వల్ల ఫోన్ ఇంకా హీటెక్కుతోంది. అయితే ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు హెవీ యాప్స్ అంటే గేమ్లు ఆడడం వంటివి చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.