Tirupathi Rao
Whatsapp New Feature: వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక క్రేజీ ఫీచర్ తో యూజర్స్ ని స్టన్ చేస్తోంది. మరి.. ఆ ఫీచర్ ఏంటి? దాని ప్రత్యేకతో ఏంటో చూద్దాం.
Whatsapp New Feature: వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక క్రేజీ ఫీచర్ తో యూజర్స్ ని స్టన్ చేస్తోంది. మరి.. ఆ ఫీచర్ ఏంటి? దాని ప్రత్యేకతో ఏంటో చూద్దాం.
Tirupathi Rao
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మెసేజింగ్ కోసం విరివిగా వాడుతున్న ఏదైనా యాప్ ఉందంటే అది వాట్సాప్ అనే చెప్పాలి. ఇండియాలో ఈ వాట్సాప్ యాప్ తెలియని స్మార్ట్ ఫోన్ యూజర్ ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గ్రూప్ కాలింగ్, వాయిస్ కాల్, వీడియో కాల్, గ్రూప్ వీడియో కాల్ అంటూ చాలానే అవసరాలకు ఈ వాట్సాప్ ని వాడేస్తున్నారు. ఇప్పుడు పేమెంట్స్ కి కూడా ఈ వాట్సాప్ పని చేస్తోంది. అలా ప్రతి విషయంలో ఈ యాప్ ని అప్ డేట్ చేస్తూ వస్తున్నారు. తరచూ ఏదో ఒక కొత్త ఫీచర్ ని కూడా తీసుకొస్తూనే ఉంటారు. అలాంటి వాట్సాప్ లో ఇప్పుడు ఇంకో క్రేజీ ఫీచర్ ని తీసుకొచ్చారు.
సాధారణంగా వాట్సాప్ లో మీరు మెసేజ్ చేయడం, కాల్ మాట్లాడం, ఆఫీస్ వర్క్ కాకుండా.. ఖాళీ సమయంలో మీరు ఎవరెవరు ఏం స్టేటస్ పెట్టారు అనే విషయాన్ని గమనిస్తూనే ఉంటారు. అలాగే మీరు కూడా మీ డైలీ లైఫ్ లో ఏదో ఒక మూమెంట్ ని స్టేటస్ గా పెడుతూ ఉంటారు. కానీ, కొన్నిసార్లు మీరు ఎవరిదైనా స్టేటస్ చూడకపోవడం.. ఎవరైనా మీరు పెట్టిన స్టేటస్ ని మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా మనకి కావాల్సిన వాళ్లు మన స్టేటస్ చూడకపోయినా.. మనం మనకి కావాల్సిన వారి స్టేటస్ మిస్ అయినా కూడా అది పెద్ద రచ్చే అవుతుంది. అందుకే అలాంటి పొరపాట్లు జరగకుండా వాట్సాప్ కొత్త ఫీచర్ ని తీసుకొస్తోంది.
అవును.. ఆ కొత్త ఫీచర్ పేరు వాట్సాప్ స్టేటస్ ర్యాంకింగ్. అంటే మీరు ఎక్కువగా ఎవరితో అయితే చాటింగ్ చేస్తూ ఉంటారో వారి వాట్సాప్ స్టేటస్ ను మీకు ముందు చూపిస్తుంది. అంటే మీరు తరచుగా ఎవరితో అయితే వాట్సాప్ లో టచ్ లో ఉంటారో వాళ్ల స్టేటస్ కు హై ప్రియారిటీ ఉంటుంది. అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ అలా అనమాట. అలాగే ఎవరిదైనా స్టేటస్ ఎక్స్ పైరీకి దగ్గర్లో ఉన్నా కూడా వారి స్టేటస్ ని ముందు చూపిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ స్టేటస్ ని మీకు కావాల్సిన వాళ్లు కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు.
అలాగే మీరు కూడా ఎవరి స్టేటస్ ని మిస్ కారు. ఈ ఫీచర్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కాకపోతే అస్సలు వాట్సాప్ స్టేటస్ చూడని వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వారు మాత్రం అసలు ఇదేం ఫీచర్ అంటూ పెదవి విరుస్తున్నారు. మొత్తానికి వాట్సాప్ మాత్రం నెలకు ఒక కొత్త ఫీచర్ తో యూజర్స్ ని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. ఇటీవలే చాట్ ఫిల్టర్ ఫీచర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చాట్స్, గ్రూప్స్, అన్ రీడ్ మెసేజెస్ అంటూ తీసుకొచ్చిన చాట్ ఫిల్టర్ ఫీచర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. మరి.. వాట్సాప్ తీసుకొస్తున్న ఈ స్టేటస్ ర్యాంకింగ్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.