Tirupathi Rao
వాట్సాప్ అంటే తెలియని స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉండరేమో. ఇప్పుడు అందరూ ఈ సోషల్ మెసేజింగ్ యాప్ నే వాడుతున్నారు. అయితే దీనిలో భద్రతకు సంబంధించి చాలా అనుమానులు ఉంటూ ఉంటాయి.
వాట్సాప్ అంటే తెలియని స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉండరేమో. ఇప్పుడు అందరూ ఈ సోషల్ మెసేజింగ్ యాప్ నే వాడుతున్నారు. అయితే దీనిలో భద్రతకు సంబంధించి చాలా అనుమానులు ఉంటూ ఉంటాయి.
Tirupathi Rao
వాట్సాప్.. ఈ సోషల్ మెసేజింగ్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. స్మార్ట్ ఫోన్ యూజర్లకు బాగా తెలిసిన, వాడే యాప్ ఇది. వరల్డ్ వైడ్ గా కూడా ఈ యాప్ కి ఎంతో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో వాట్సాప్ అనేది ఇప్పుడు తప్పకుండా వాడే మెసేజింగ్ యాప్ గా మారిపోయింది. అయితే వాట్సాప్ విషయంలో కొన్ని అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. అదేంటంటే సెక్యూరిటీ పరంగా మీ చాట్స్ వేరే వాళ్లు చదివే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వస్తుంటాయి. వాటిపై ఇప్పటికే వాట్సాప్ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది. పైగా సేఫ్టీ ఫీచర్స్ కూడా తీసుకొస్తూనే ఉంది. తాజాగా మరో సేఫ్టీ ఫీచర్ తో వాట్సాప సంస్థ ముందుకొచ్చింది.
వాట్సాప్ లో ఇప్పటికే చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. చాట్స్ అన్నీ ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్టెడ్ గా ఉంటాయి. అంటే మీ చాట్స్ ని ఆఖరికి వాట్సాప్ కూడా చదవలేదు. పైగా కాల్స్ కి కూడా ఎన్ క్రిప్షన్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ కాల్స్ ని కూడా ఎవరూ వినలేరు. ఇలాంటి ఫీచర్స్ తో మీ డేటాకి, చాట్స్ కి, కాల్స్ కి భద్రత అనేది ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారం అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా.. లాక్డ్ చాట్స్ అనే ఫీచర్ కూడా వాట్సాప్ లో ఉంది. దీనివల్ల మీకు నచ్చిన చాట్స్ ని మీరు లాక్ చేసుకోవచ్చు. అలాంటి చాట్స్ ఓపెన్ చేయాలి అంటే మీరు పెట్టిన పాస్ వర్డ్ ని టైప్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఫీచర్ తో మీ చాట్స్ ని ఎవరూ చూడలేరు. ఇప్పుడు ఆ ఫీచర్ ని అప్ డేట్ చేస్తూ సీక్రెట్ కోడ్ ఫీచర్ ను వాట్సాప్ లాంఛ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ చాట్స్ ని లాక్ చేసుకోవచ్చు. మీరు లాక్ చేసిన చాట్స్ అసలు వాట్సాప్ యాప్ లో కనిపించవు. మీకు ఒకవేళ ఆ చాట్స్ ని చూడాలి అంటే సెర్చ్ బార్ లో సీక్రెట్ కోడ్ అని టైప్ చేస్తే లాక్డ్ చాట్స్ ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ చాట్స్ ఓపెన్ కావాలి అంటే మీరు పాస్ వర్డ్ ని టైప్ చేయాలి. ఆ పాస్ వర్డ్ ని పదాలతో మాత్రమే కాదు.. ఏమోజీలతో కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ లాక్డ్ చాట్స్ ఇంకా భద్రంగా ఉంటాయి. వీటిని ఎవరూ చదవలేరు కూడా.
ఇలాంటి ఒక ఫీచర్ ఇప్పుడు లవర్స్ కి బాగా యూజ్ అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. పైగా నెట్టింట వాట్సాప్ తెచ్చిన ఈ సేఫ్టీ ఫీచర్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ లో కొత్త సర్వీసెస్ స్టార్ట్ చేశారు. కొంత డబ్బు ఇస్తే మీరు చెప్పిన వాట్సాప్ నంబర్ హ్యాక్ చేస్తామంటూ సర్వీసెస్ ప్రారంభించారు. ఇలాంటి తరుణంలో వాట్సాప్ నుంచి వచ్చిన ఈ సేఫ్టీ ఫీచర్ ముఖ్యంగా ప్రేమికులకు బాగా ఉపయోగపడేలా ఉంది. దీనివల్ల వాళ్ల చాట్ మాత్రమే కాదు.. వాళ్ల వ్యక్తిగత సందేశాలు, ఫొటోలు కూడా భద్రంగా ఉన్నట్లే అవుతుంది. మరి.. వాట్సాప్ నుంచి వచ్చిన ఈ సేఫ్టీ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.