iDreamPost

WhatsAppలో న్యూ డిజైన్.. కొత్త ఫీచర్లు కూడా.. ఇప్పుడే చెక్ చేసుకోండి

వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త డిజైన్ ను ఫీచర్లను తీసుకొచ్చింది.

వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త డిజైన్ ను ఫీచర్లను తీసుకొచ్చింది.

WhatsAppలో న్యూ డిజైన్.. కొత్త ఫీచర్లు కూడా.. ఇప్పుడే చెక్ చేసుకోండి

ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు వాట్సాప్ ను వినియోగిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ విధమైన సమచారం అయినా సరే క్షణాల్లో వాట్సాప్ ద్వారా పంపించుకునే సౌలభ్యం ఉండడంతో వాట్సాప్ కు ప్రాధాన్యత పెరిగింది. కాల్స్, మెసేజెస్, వీడియోకాల్స్, ఆడియో కాల్స్, వాయిస్ రికార్డింగ్స్, ఇమేజెస్, వీడియోలను పంపుకునే వీలుండడంతో ఈ మెసేజింగ్ యాప్ కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అయితే వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ సారి ఫీచర్లతో పాటు కొత్త డిజైన్ ను కూడా లాంచ్ చేసింది.

వాట్సాప్ తన యూర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రైవసీ ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇది టెక్స్ట్ రీడబిలిటీని మెరుగుపరచడానికి ముదురు బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉంది. లైట్ మోడ్ అదనపు వైట్ స్పేస్‌తో వస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ దాని బ్రాండ్ గుర్తింపుతో కొత్త ఆకుపచ్చ రంగును తీసుకువచ్చింది. ఐకాన్, బటన్ డిజైన్‌లలో కూడా మార్పులు చేసింది.

చాట్‌లు ట్యాబ్‌లో, వినియోగదారులు వాట్సాప్ లోగోను చూడవచ్చు, ఇంటర్‌ఫేస్‌లో ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్ పైభాగంలో ఉన్న నావిగేషన్ ట్యాబ్‌లు కిందికి మార్చబడ్డాయి. మరొక మార్పు ఏంటంటే.. సెర్చ్ బాక్స్ ను మార్చడం. దీన్ని చాట్ లు, ట్యాప్ ల పై భాగంలో పొందుపరిచింది వాట్సాప్. ఈ అప్‌డేట్ క్రమంగా వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. అయితే మీరు ఆ అప్ డేట్ ఫీచర్లను, న్యూ డిజైన్ ను చూడాలనుకుంటే వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.

Whatsapp in new design

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి