P Venkatesh
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. వాయిస్ మెసేజ్ లను జర్నీలో ఉన్నప్పుడు చదవలేకపోతున్నారా? వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. వాయిస్ మెసేజ్‌లు వినకుండానే ఏముందో తెలుసుకోవచ్చు
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. వాయిస్ మెసేజ్ లను జర్నీలో ఉన్నప్పుడు చదవలేకపోతున్నారా? వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. వాయిస్ మెసేజ్‌లు వినకుండానే ఏముందో తెలుసుకోవచ్చు
P Venkatesh
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రాకముందు ఎస్ఎంఎస్ ల రూపంలో లేదా మెయిల్ ద్వారా సమాచారం పంపడమో, పొందడమో జరిగేది. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం సోషల్ మీడియా వినియోగం పెరడంతో వీడియో కాల్స్, వాయిస్ మెసేజ్ లు పంపడం ఈజీ అయిపోయింది. వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక సుధీర్ఘ మెసేజ్ లు పంపాలనుకుంటే వాయిస్ రూపంలో ఆడియో మెసేజ్ లు సెండ్ చేయడం సులభంగా మారింది. ఇక వాట్సాప్ యూజర్లకు ఆడియో మెసేజ్ లు మరింత సులువుగా తెలుసుకునే సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో ఆడియో మెసేజ్ లు వినకుండానే అందులో ఏముందో తెలుసుకోవచ్చు.
ఇన్ స్టంట్ మెసెంజర్ వాట్సాప్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లున్నారు. వాట్సాప్ యాప్ ద్వారా క్షణాల్లో ఆడియోలు, వీడియోలు, టెక్ట్స్, ఇమేజ్ లు వంటి ద్వారా సమాచారం పొందే వీలు ఏర్పడింది. యూజర్లకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నది. ఇప్పుడు యూజర్లకు మరో ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాయిస్ మెసేజ్ లను వినకుండానే టెక్ట్స్ రూపంలో తెలుసుకోవచ్చు. జర్నీలో ఉన్నప్పుడు, లేదా ఆఫీసుల్లో ఉన్నప్పుడు ఆడియో మెసేజ్ లు వినడం కుదరకపోవచ్చు. ఇయర్ ఫోన్స్ లేనప్పుడు వాయిస్ మెసేజ్ లను వినడం కష్టమవుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆ వాయిస్ సందేశాల్లో ఏముందో చెప్పే ఫీచర్‌ను వాట్సప్ తీసుకొస్తోంది. ఇదో ట్రాన్స్‌స్క్రిప్షన్ ఫీచర్. అంటే.. వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపంలో చూపిస్తుందన్నమాట. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. వాయిస్ మెసేజ్ వచ్చినప్పుడు లేదా పంపినప్పుడు దాని కింద ట్రాన్స్‌స్క్రిప్షన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అందులోని మెసేజ్ ను యథావిధిగా టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. కేవలం ఏ భాషలో ఉంటుందో ఆ భాషకు మాత్రమే టెక్ట్స్ ను ఇస్తుంది. ప్రస్తుతానికి ఇంగ్లిష్, హిందీ, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ భాషలకు సపోర్ట్ చేస్తోంది. సాధారణ యూజర్లకు ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.