iDreamPost
android-app
ios-app

శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి?

శాంసంగ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. మీరు శాంసంగ్ స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్లైతే వెంటనే ఆ పని చేయండి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది.

శాంసంగ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. మీరు శాంసంగ్ స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్లైతే వెంటనే ఆ పని చేయండి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది.

శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి?

స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. యూజర్ల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని శాంసంగ్ డిఫరెంట్ మోడల్స్ ను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. శాంసంగ్ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే తాజాగా శాంసంగ్ వాడే యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. మీరు శాంసంగ్ స్మార్ట్ ఫోన్లను వాడుతున్నట్లైతే త్వరగా ఆ పనిచేయండి. లేకపోతే నష్టపోతారు. కేంద్ర ప్రభుత్వం శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ ఫోన్లను వాడుతున్న వారు వెంటనే తమ ఫోన్లను అప్‌ డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ అలర్ట్ జారీ చేసింది.

శాంసంగ్ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్న వారికి హెచ్చరిక. వెంటనే మీ ఫోన్లను అప్ డేట్ చేసుకోండి. శాంసంగ్‌ ఇటీవలే విడుదల చేసిన గెలాక్సీ ఎస్‌ 23, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 5, గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 5 సహా ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 ఓఎస్‌తో పని చేసే శాంసంగ్‌ స్మార్ట్ ఫోన్లలో భద్రతా పరమైన సమస్య ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. కాబట్టి వెంటనే తమ శాంసంగ్ స్మార్ట్‌ ఫోన్‌ లేటెస్ట్‌ సెక్యూరిటీ అప్డేట్‌ చేసుకోవాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెర్ట్‌ ఇన్‌ (CERT- In) సూచించింది. అప్ డేట్ చేసుకోకపోతే భద్రతాపరమైన లోపాల వల్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు చోరీ చేసే ప్రమాదం ఉందని తెలిపింది.

శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో గుర్తించిన లోపాలు ఇవే:

శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో.. నాక్స్ ఫీచర్లపై కంట్రోలింగ్ లేకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, ఏఆర్‌ ఎమోజీ యాప్‌లో ఆథరైజేషన్ సమస్యలు, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను గుర్తించి సరిచేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని సెర్ట్‌-ఇన్‌ తెలిపింది. ఈ లోపాల కారణంగా సైబర్ క్రిమినల్స్ సెక్యూరిటీ ఫీచర్లను నిలువరించి సున్నితమైన సమాచారాన్ని సేకరించే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఒక వేళ ఆయా ఉత్పత్తుల్లో ఉన్న లోపాలను గుర్తించి చొరబడితే డివైజ్‌ పిన్‌ను, ఏఆర్‌ ఎమోజీ సాండ్‌బాక్స్‌ డేటాను సైబర్ దాడులు చేసే వారు రీడ్‌ చేయగలరని తెలిపింది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ ను వెంటనే అప్ డేట్ చేసుకోండి.