P Venkatesh
Mobile Number Portability New Rules: మీరు మీ ఫోన్ నెంబర్ నెట్ వర్క్ మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇకపై నెట్ వర్క్ మారేందుకు అన్ని రోజులు ఆగాల్సిందే. ఫోన్ నంబర్ పోర్టింగ్‌కు కేంద్రం కొత్త రూల్ తెచ్చింది.
Mobile Number Portability New Rules: మీరు మీ ఫోన్ నెంబర్ నెట్ వర్క్ మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇకపై నెట్ వర్క్ మారేందుకు అన్ని రోజులు ఆగాల్సిందే. ఫోన్ నంబర్ పోర్టింగ్‌కు కేంద్రం కొత్త రూల్ తెచ్చింది.
P Venkatesh
స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఏజ్ తో సంబంధం లేకుండా మొబైల్ లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి రెండు సిమ్ కార్డులను కూడా వాడుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఒక నెట్ వర్క్ నుంచి మరొక నెట్ వర్క్ కు మారేందుకు యూజర్లు ఇంట్రస్టు చూపిస్తుంటారు. ఫోన్ నెంబర్ మార్చకుండానే మొబైల్ నంబర్ పోర్టింగ్ ద్వారా ఇతర నెట్ వర్క్ లకు మారే సౌకర్యం ఉంది. అయితే తాజాగా మొబైల్ నంబర్ పోర్టింగ్ కోసం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం నెట్ వర్క్ మారడానికి ఇకపై అన్ని రోజులు ఆగాల్సిందే. ఈ కొత్త నిబంధన జులై 1 నుంచి అమల్లోకి రానుంది.
మీరు మొబైల్ నెంబర్ పోర్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. ఫోన్ నంబర్ పోర్టింగ్‌కు అర్హత పొందేందుకు ఏడు రోజుల పాటు ఆగాల్సిందే అని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. సిమ్ కార్డుల పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డ్ నెట్ వర్క్ మార్చుకునేందుకు 7 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇది 10 రోజులుగా ఉంది. తాజాగా దీన్ని 7 రోజులకు తగ్గించారు. అంటే వారం రోజుల పాటు వేరే నెట్ వర్క్ కు మారేందుకు అవసరమయ్యే యూనిక్ పోర్టింగ్ కోడ్ ను జారీ చేయడం జరగదు.
అయితే సిమ్ కార్డు పోయినప్పుడు లేదా.. పాడైపోయినప్పుడు సంబంధిత టెలికాం సంస్థలను సంప్రదిస్తే అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకుని కొత్త సిమ్ కార్డును జారీ చేస్తుంటారు. అదే ఒక వేళ ఫోన్ నెంబర్ మార్చుకోకుండా నెట్ వర్క్ మార్చుకోవాలనుకున్నప్పుడు మీ ఫోన్ నుంచి PORT <మొబైల్ నంబర్> ను 1900 కు ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుంది. దీంతో సదరు మొబైల్ నంబర్ వినియోగదారుడికి ఒక యునిక్ పోర్టింగ్ కోడ్ వస్తుంది. ఇతర మొబైల్ కంపెనీ నెట్‌వర్క్‌కు మారాలనుకున్నప్పుడు ఈ యూనిక్ పోర్టింగ్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే తాజా నిబంధనల ప్రకారం సిమ్ కార్డు నెట్ వర్క్ మారడానికి వారం రోజులపాటు ఆగాల్సి ఉంటుంది.