iDreamPost

TRAI కొత్త మార్గదర్శకాలు.. ఇక స్పామ్‌ కాల్స్‌ సమస్య తీరినట్టే!

స్పామ్ కాల్స్ తో విసిగెత్తిపోతున్నారా? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ సమస్య త్వరలోనే తీరనుంది. స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త మార్గ దర్శకాలను రూపొందించింది.

స్పామ్ కాల్స్ తో విసిగెత్తిపోతున్నారా? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ సమస్య త్వరలోనే తీరనుంది. స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త మార్గ దర్శకాలను రూపొందించింది.

TRAI కొత్త మార్గదర్శకాలు.. ఇక స్పామ్‌ కాల్స్‌ సమస్య  తీరినట్టే!

ఆఫీసులో ఉన్నప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాయి. తీరా లిఫ్ట్ చేసి చూస్తే అది స్పామ్ కాల్ అని తెలిసి విసిగెత్తిపోతారు. లోన్ కోసం, క్రెడిట్ కార్డుల కోసం, నిత్యం పదుల సంఖ్యలో స్పామ్ కాల్స్ వస్తుంటాయి. ముఖ్యంగా బ్యాంకులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, ఆర్థిక సంస్థలు మార్కెటింగ్ చేసుకునే పనిలో పడి స్పామ్ కాల్స్ తో విసిగించేస్తుంటాయి. కాగా ఈ స్పామ్ కాల్స్ వల్ల మోసాలకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్పామ్ కాల్స్ సమస్య త్వరలోనే తీరనున్నది. స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. స్పామ్ కాల్స్ కు స్వస్తి చెప్పేలా కొత్త మార్గదర్శకాలను జారీ చేయనుంది.

నిత్యం వచ్చే స్పామ్ కాల్స్ మిమ్మల్ని విసిగిస్తున్నాయా? వీటికి ఎలా చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. త్వరలోనే స్పామ్ కాల్స్ సమస్య తీరనున్నది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ట్రాయ్ రెడీ అవుతోంది. స్పామ్ కాల్స్ సమస్య తీర్చేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త గైడ్ లైన్స్ ను రూపొందించింది. స్పామ్ కాల్స్ చేస్తున్న కంపెనీల నుంచి లబ్ధి పొందుతున్న టెలికాం కంపెనీలు ఇకపై వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ట్రాయ్ నిబంధనలను ఉల్లంఘిస్తే టెలికాం సంస్థలు జరిమానాల భారం మోయాల్సి ఉంటుంది.

టెలికాం కంపెనీలు కాల్స్‌ను గుర్తించడానికి వీలుగా వాటి ఐడెంటిటీని వెల్లడించాల్సి ఉంటుంది. ఇందుకు మూడు వేర్వేరు సిరీస్‌లను తీసుకురానున్నారు. మార్కెటింగ్ కాల్స్‌కు 140, సర్వీస్‌ కాల్స్‌ కోసం 160, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కమ్యూనికేషన్‌ కోసం 111 ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. టెలికాం ఆపరేటర్లు ప్రతీ కాలర్‌ పేరు, సెక్టార్‌తో సహా వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో యూజర్లకు స్పామ్ కాల్స్ ను గుర్తించడం సులువైపోతుంది. స్పామ్ కాల్స్ నియంత్రణకు ట్రాయ్ చేసిన మార్గదర్శకాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి