iDreamPost
android-app
ios-app

స్నాప్‌చాట్‌లో సరికొత్త ఏఐ ఫీచర్స్.. ఇందులో మీరు టైమ్ ట్రావెల్ చేయచ్చు!

  • Published Jun 22, 2024 | 5:37 PM Updated Updated Jun 22, 2024 | 5:37 PM

Snapchat's New GenAI Features: ప్రస్తుతం ఆర్టిఫీషియల్ పోటీ నడుస్తోంది. ఆయా డిజిటల్ యాప్ లు కొత్త కొత్త ఏఐ ఫీచర్స్ తో యూజర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే యాపిల్ ఐఓఎస్ 18లో ఏఐ ఫీచర్స్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. జెన్మోజీ అనే ఏఐ ఫీచర్ ని తీసుకొచ్చింది. జస్ట్ మనం టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే మనకి కావాల్సిన మెమోజీని తయారు చేసి ఇస్తుంది. ఈ ఓఎస్ అప్డేట్ త్వరలోనే యూజర్స్ కి అందుబాటులోకి రానుంది. తాజాగా స్నాప్ చాట్ కూడా తమ యూజర్స్ కోసం జెన్ ఏఐ ఫీచర్స్ ని పరిచయం చేసింది. ఈ ఫీచర్స్ త్వరలోనే అందుబాటులోకి వస్తాయని స్నాప్ చాట్ తన అధికారిక ఖాతాలో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది. 

Snapchat's New GenAI Features: ప్రస్తుతం ఆర్టిఫీషియల్ పోటీ నడుస్తోంది. ఆయా డిజిటల్ యాప్ లు కొత్త కొత్త ఏఐ ఫీచర్స్ తో యూజర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే యాపిల్ ఐఓఎస్ 18లో ఏఐ ఫీచర్స్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. జెన్మోజీ అనే ఏఐ ఫీచర్ ని తీసుకొచ్చింది. జస్ట్ మనం టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే మనకి కావాల్సిన మెమోజీని తయారు చేసి ఇస్తుంది. ఈ ఓఎస్ అప్డేట్ త్వరలోనే యూజర్స్ కి అందుబాటులోకి రానుంది. తాజాగా స్నాప్ చాట్ కూడా తమ యూజర్స్ కోసం జెన్ ఏఐ ఫీచర్స్ ని పరిచయం చేసింది. ఈ ఫీచర్స్ త్వరలోనే అందుబాటులోకి వస్తాయని స్నాప్ చాట్ తన అధికారిక ఖాతాలో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది. 

స్నాప్‌చాట్‌లో సరికొత్త ఏఐ ఫీచర్స్.. ఇందులో మీరు టైమ్ ట్రావెల్ చేయచ్చు!

మీరు ఇంట్లో ఉండి ఒక ఫోటో లేదా వీడియో తీస్తారు. అయితే మీ వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ ని మార్చాలంటే చాలా కష్టం. మీరు గ్రీన్ స్క్రీన్ లేదా బ్లూ స్క్రీన్ మీద షూట్ చేసి.. దాన్ని ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ లేదా ఎడిటింగ్ యాప్ లో బ్యాక్ గ్రౌండ్ గ్రీన్ లేదా బ్లూ స్క్రీన్ ని తొలగించాలి. ఆ తర్వాత బ్యాక్ గ్రౌండ్ లో ఫోటోనో లేదా వీడియోనో యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంత ప్రాసెస్ లేకుండా, అసలు గ్రీన్ మ్యాట్ అవసరం లేకుండా సులువుగా మీ వీడియో బ్యాక్ గ్రౌండ్ ని మార్చుకోవచ్చు. స్నాప్ చాట్ యొక్క కొత్త జెన్ఏఐ మోడల్ ఫీచర్ తో ఇది సాధ్యపడుతుంది. జస్ట్ టెక్స్ట్ టైప్ చేస్తే చాలు.. రియల్ టైంలో కస్టమ్ ఏఆర్ అనుభూతిని జనరేట్ చేయవచ్చు.      

ఉదాహరణకు మీ ఫోటోలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ తీసేసి రాజుల కాలం బ్యాక్ గ్రౌండ్ పెట్టాలి అని అనుకుంటే కనుక జస్ట్ మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ ని ఇస్తే చాలు. త్వరలో రానున్న ఈ కొత్త లెన్స్ తో మీరు రాజుల కాలం నాటి బ్యాక్ గ్రౌండ్ తో మ్యాచ్ అయ్యేలా మీ ఒంటి మీద దుస్తులను, ముఖాన్ని కూడా మార్చుకోవచ్చు. దీని కోసం మీరు ఒక టెక్స్ట్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ముఖాన్ని జంతువుల ముఖాలతో మార్చుకోవడానికి ఏదైనా జంతువు పేరు ఇన్పుట్ ఇస్తే చాలు.. మీ ముఖం మారిపోతుంది. ఉదాహరణకు పాండా అని ఇస్తే.. మీ ముఖం పాండాలా మారిపోతుంది. కార్టూన్ లా మారిపోవచ్చు.

ఇలా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ కొత్త ఏఐ జనరేటివ్ ఫీచర్స్ తో. యాపిల్ ఎలా అయితే మనం ఇచ్చిన ఇన్పుట్ ఆధారంగా జెన్మోజీని క్రియేట్ చేస్తుందో.. ఇది అంతకు మించి బ్యాక్ గ్రౌండ్ ని మార్చేస్తుంది. ముఖాన్ని మార్చేస్తుంది. స్నాప్ చాట్ యూజర్లు ఈ జెన్ఏఐ పవర్డ్ లెన్స్ ని త్వరలోనే చూడవచ్చు. మీరు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోవచ్చు. మీరు ఒక కొత్త సెట్ వేసుకోవచ్చు. గతంలోకి వెళ్ళవచ్చు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో అంచనా వేసి ఫ్యూచర్ లోకి వెళ్ళచ్చు. మీ వెనక పరిసరాలను మార్చుకోవచ్చు. ఇదంతా మీరు అనుకుంటున్న దాన్ని టెక్స్ట్ టైప్ చేస్తే చాలు. కోడింగ్ లు రాయాల్సిన పని లేదు. 

కస్టమ్ లెన్సులని క్రియేట్ చేయడానికి స్నాప్ చాట్ టెక్స్టువల్ ప్రాంప్ట్స్ ని యూజ్ చేసుకోవడానికి యూజర్స్ ని అనుమతిస్తుంది. స్నాప్ చాట్ మూడు రకాల వ్యక్తులు ఎలా తమ గెటప్ లు మార్చుకుంటారో అనే దాన్ని స్నాప్ చాట్ చూపించింది. ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్న ఇమేజ్ లో వారి గెటప్ లని త్వరలో రాబోతున్న లెన్స్ ఫీచర్ తో మార్చి చూపించింది. ఈ ఇమేజ్ లో వారి బ్యాక్ గ్రౌండ్ సహా వారి వేసుకున్న దుస్తులు కూడా మారిపోయాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఏఐ మోడల్ ఫీచర్ స్మార్ట్ ఫోన్స్ లో రియల్ టైంలో పని చేస్తుంది.

ఇప్పటికే స్నాప్ చాట్ లో డ్రీమ్స్, ఏఐ పెట్స్, బిట్మోజీ బ్యాక్ గ్రౌండ్స్, చాట్ వాల్ పేపర్ వంటి జెన్ఏఐ పవర్డ్ ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాదు.. లెన్స్ స్టూడియో 5.0కి జెన్ఏఐ సూట్ ని తీసుకురానుంది. ఈ కొత్త టూల్స్ తో క్రియేటర్లు.. కస్టమ్ ఎంఎల్ మోడల్స్, అసెట్స్ లెన్సెస్ కి పవర్ ని అందిస్తాయి. నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీ  ఆఫ్ లండన్ తో కలిసి ‘ఐకానిక్ పోర్ట్రెయిట్ స్టైల్స్’ ని కస్టమ్ లెన్స్ క్రియేషన్ కోసం తీసుకురానుంది. ఈ కొత్త లెన్స్ స్టూడియో అప్డేట్ తో ఫేస్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ ఛేంజ్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ వంటి ఫీచర్స్ ని పొందవచ్చు. ఫేస్ ఎఫెక్ట్ తో టెక్స్ట్ ప్రాంప్ట్స్ లేదా అప్లోడ్ చేసిన ఇమేజ్ ని జెన్ఏఐతో పూర్తిగా మార్చేయవచ్చు.