iDreamPost
android-app
ios-app

అదిరిపోయే ఫీచర్స్ తో సరి కొత్త EV స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 212 కి.మీ రేంజ్!

ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనే ప్లాన్ లో ఉన్న వారికి అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. సింగిల్ ఛార్జ్ తో 212 కి. మీల వరకు ప్రయాణం చేయొచ్చని కంపెనీ తెలిపింది.

ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనే ప్లాన్ లో ఉన్న వారికి అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. సింగిల్ ఛార్జ్ తో 212 కి. మీల వరకు ప్రయాణం చేయొచ్చని కంపెనీ తెలిపింది.

అదిరిపోయే ఫీచర్స్ తో సరి కొత్త EV స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 212 కి.మీ రేంజ్!

ఇప్పుడంతా ఈవీల హవా నడుస్తోంది. వాహనదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చు, ఆధునిక ఫీచర్స్ తో ఈవీ స్కూటర్లు అందుబాటులోకి వస్తుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఓలా, ఏథర్ తదితర ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీలు తమ మోడల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసి సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఉండడంతో ఈవీలకు ప్రాధాన్యత పెరిగింది. అయితే తాజాగా మరో సరికొత్త స్కూటర్ మార్కెట్ లోకి విడుదలైంది. సింగిల్ ఛార్జ్ తో ఏకంగా 212 కి.మీలు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది.

పెట్రోల్ రేట్లు పెరగడం, పెట్రోల్ తో నడిచే టూ వీలర్స్ కు కూడా ధరలు పెరుగుదల కారణంగా ఈవీ స్కూటర్ల కొనుగోల్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త ఈవీ స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు సింపుల్ వన్. ఈ స్కూటర్ లో అత్యాధునిక ఫీచర్లతో పాటు బ్రహ్మాండమైన మైలేజ్ ను కూడా అందిస్తోంది. ఒక్కసారి బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 212 కి.మీల రేంజ్ ఇస్తుందని సింపుల్ ఎనర్జీ కంపెనీ వెల్లడించింది. ఈ స్కూటర్ గరిష్ట స్పీడు గంటకు 105 కిలోమీటర్లుగా ఉంది. ఇది 2.77 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ ప్రకటించింది.

సింపుల్ వన్ ఈవీ ఫీచర్స్:

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో దీనికి USB ఛార్జింగ్ పోర్టు, CBS డిస్క్ బ్రేక్‌లు, 30 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉన్నాయి. అలాగే 7 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే ఉంది. ఇంకా యాప్‌తో కనెక్ట్ అయ్యేందుకు టచ్ స్క్రీన్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఈ స్కూటర్ ధరను కంపెనీ రూ.1,58,000గా ప్రకటించింది. ఈ కొత్త స్కూటర్ నమ్ము రెడ్, బ్రాజెన్ బ్లాక్, గ్రేస్ వైట్, అజూర్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌లో 5.0KWh బ్యాటరీ ఉంది. దీనికి 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటర్‌ని సెట్ చేశారు. సింపుల్ వన్ 72NM పీక్ టార్క్ ఇస్తుంది. అలాగే పీక్ పవర్ 8.5kwగా ఉంది. యాప్ ద్వారా ఈ స్కూటర్‌ని రిమోట్ యాక్సెస్ చెయ్యవచ్చు. రైడ్ స్టాటిస్టిక్స్ చూడవచ్చు. రూట్లను సేవ్ చెయ్యవచ్చు. మరి సింపుల్ ఎనర్జీ ప్రవేశపెట్టిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.