nagidream
Samsung Galaxy Z Fold 6, Z Flip 6 5G AI Phones: శాంసంగ్ కంపెనీ కొత్త మడత ఫోన్లను లాంఛ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 6, జడ్ ఫ్లిప్ 6 ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. భారత మార్కెట్లో వీటి ధరలను కూడా ప్రకటించింది. ఈ ఫోన్లను దక్కించుకోవాలంటే ప్రీ ఆర్డర్ చేసుకోవాలని పేర్కొంది.
Samsung Galaxy Z Fold 6, Z Flip 6 5G AI Phones: శాంసంగ్ కంపెనీ కొత్త మడత ఫోన్లను లాంఛ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 6, జడ్ ఫ్లిప్ 6 ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. భారత మార్కెట్లో వీటి ధరలను కూడా ప్రకటించింది. ఈ ఫోన్లను దక్కించుకోవాలంటే ప్రీ ఆర్డర్ చేసుకోవాలని పేర్కొంది.
nagidream
జడ్ ఫోల్డ్, ఫ్లిప్ సిరీస్ నుంచి తాజాగా జడ్ 6 ఫోన్లను రిలీజ్ చేసింది శాంసంగ్ కంపెనీ. శాంసంగ్ జడ్ ఫోల్డ్ 6, జడ్ ఫ్లిప్ 6 ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. గత సిరీస్ లతో పోలిస్తే ఈ ఫోన్లు చాలా స్టైలిష్ లుక్ లో ఉండడం విశేషం. 10 వేలకే ఈ ఫోన్లను బుక్ చేసుకోవచ్చు.
2600 నిట్స్ తో 1.5 ఎక్స్ బ్రైటర్ డిస్ల్పేతో వస్తుంది. 4400 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 77 గంటల పాటు మ్యూజిక్ వినచ్చు. 23 గంటల పాటు వీడియోలు చూడవచ్చు. ఫోల్డ్స్ మోస్ట్ పవర్ ఫుల్ కెమెరా ఆప్షన్స్ తో వస్తుంది. ఇందులో రెండు ఫ్రంట్ కెమెరాలు, రెండు రేర్ కెమెరాలు ఇచ్చారు. ఫ్రంట్ కెమెరాల్లో ఒకటి 10 మెగా పిక్సెల్ ది కాగా.. మరొకటి 4 మెగా పిక్సెల్ ది. రేర్ కెమెరాల విషయానికొస్తే.. 12 ఎంపీ అల్ట్రా వైడ్, 50 ఎంపీ వైడ్ యాంగిల్, 2 ఎక్స్ ఆప్టికల్ క్వాలిటీ జూమ్ కెమెరా, 10 ఎంపీ టెలీఫోటో, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరాలు ఇచ్చారు. ఇందులో ఉన్న మరొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే.. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని సర్కిల్ గీసి దాన్ని గూగుల్ లో సెర్చ్ చేయవచ్చు. ఐపీ 48 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో వస్తుంది. ఈ ఫోన్ ని కొనుగోలు చేస్తే ఫోన్ తో పాటు యూఎస్బీ సీ ఛార్జ్ కేబుల్, సిమ్ ఎజెక్షన్ పిన్ వస్తాయి. ఇది 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ. 1,64,999గా ఉంది. 10 వేల రూపాయలకే దీన్ని ప్రీ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
జడ్ ఫ్లిప్ 6 5జీ ఏఐ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్:
12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగా పిక్సెల్ వైడ్, 2 ఎక్స్ ఆప్టికల్ క్వాలిటీ జూమ్ కెమెరాలను ఇచ్చారు. 10 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఒకటి ఇచ్చారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్ గా ఉంది. సింగిల్ ఛార్జ్ తో 68 గంటలు మ్యూజిక్ వినచ్చు. 23 గంటల పాటు వీడియోలు చూడచ్చు. ఇది కూడా ఐపీ 48 వాటర్ రెసిస్టెన్స్, ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో వస్తుంది. ఈ ఫోన్ ని కొంటే ఫోన్ తో పాటు సిమ్ ఎజెక్టర్ పిన్, యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు. ఇది 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ. 1,09,999గా ఉంది. దీన్ని కూడా 10 వేల రూపాయలకే ప్రీ బుక్ చేసుకోవచ్చు. దీన్ని ప్రీబుక్ చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.