iDreamPost
android-app
ios-app

Samsung నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్‌.. మతిపోయే ఫీచర్లు.. కేవలం రూ.7,999కే

  • Published Sep 13, 2024 | 12:03 PM Updated Updated Sep 13, 2024 | 12:03 PM

Samsung Galaxy M05: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే తక్కువ ధరలోనే శాంసంగ్ నుంచి న్యూ ఫోన్ రిలీజ్ అయ్యింది. కేవలం రూ. 7999కే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy M05: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే తక్కువ ధరలోనే శాంసంగ్ నుంచి న్యూ ఫోన్ రిలీజ్ అయ్యింది. కేవలం రూ. 7999కే సొంతం చేసుకోవచ్చు.

Samsung నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్‌.. మతిపోయే ఫీచర్లు.. కేవలం రూ.7,999కే

ఇటీవల పలు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తక్కువ ధరకే ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీ పెరగడం.. మార్కెట్ లో నిలదొక్కుకునేందుకు 10 వేల లోపే స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. మంచి క్వాలిటీ, ఫీచర్లు అద్భుతంగా ఉన్న ఫోన్లు కొనాలంటే 15-20 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 10 వేల ధరలోనే మతిపోయే ఫీచర్లో ఫోన్లు లభిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ శాంసంగ్ నుంచి మరో కొత్త మొబైల్ శాంసంగ్‌ గెలాక్సీ ఎం05 వచ్చేసింది. బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. శాంసంగ్ ఫోన్లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఈ కంపెనీ నుంచి వచ్చే ఫోన్లు మార్కెట్ లో హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి.

తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ కోసం చూస్తున్నారా? రూ. 10 వేల లోపు ధరతోనే క్రేజీ ఫీచర్లు ఉండే మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే శాంసంగ్‌ గెలాక్సీ ఎం05 పైన ఓ లుక్కేయండి. అదిరిపోయే ఫీచర్లతో కేవలం రూ. 7,999కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ శాంసంగ్ కొత్త ఫోన్‌ 4జీబీ+ 64జీబీ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. మింట్‌ గ్రీన్‌ కలర్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ను మీరు శాంసంగ్ స్టోర్స్, అమెజాన్ లో కూడా కొనుగోలు చేయొచ్చు. రెండేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందించనున్నది.

ఇందులో 6.7 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత వన్‌ యూఐతో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ ఉపయోగించారు. డ్యూయల్‌ నానో సిమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వెనకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 8ఎంపీ కెమెరా ఇచ్చారు. యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటితో, 25వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ శాంసంగ్‌ గెలాక్సీ ఎం05 ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.