iDreamPost
android-app
ios-app

Credit Apps: ఈ యాప్స్‌ మీ మొబైల్‌లో ఉన్నాయా? వెంటనే డిలీట్‌ చేయండి!

లోన్‌ యాప్స్‌ మోసాల కారణంగా నిత్యం దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఇబ్బందుల పాలవుతున్నారు. లోన్‌ యాప్స్‌ అరాచకాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్లు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు...

లోన్‌ యాప్స్‌ మోసాల కారణంగా నిత్యం దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఇబ్బందుల పాలవుతున్నారు. లోన్‌ యాప్స్‌ అరాచకాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్లు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు...

Credit Apps: ఈ యాప్స్‌ మీ మొబైల్‌లో ఉన్నాయా? వెంటనే డిలీట్‌ చేయండి!

ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్ జనరేషన్‌లో చాలా కొత్త కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. వాటిలో మన పనులను సులువు చేసే యాప్స్ కొన్ని ఉంటే.. మనకు ముప్పు కలిగించే యాప్స్ మరికొన్ని ఉన్నాయి. ఇప్పటికే మనం ఎన్నో ఫేక్ యాప్స్ ను చూసి ఉన్నాం. ఇక తాజాగా స్మార్ట్ ఫోన్ యూజర్స్ పర్సనల్ డేటాను భద్రపరచడానికి.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్స్ ను తొలగించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ ఏడాది 18 ఫేక్ లోన్ యాప్స్ ను గుర్తించినట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళ్తే..

మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ యూజర్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్త కొత్త యాప్ లు అందుబాటులోకి రావడంతో.. ప్రజలకు కావాల్సిన సదుపాయాలు సులభంగా అందుతున్నాయి. షాపింగ్, ఫుడ్, బ్యాంకింగ్, లోన్ ఇలా అన్ని సదుపాయాలు అరచేతిలోనే అందుబాటులోకి వచ్చేశాయి. ఈ క్రమంలో యూజర్స్ వినియోగదారీతనం మోసగాళ్లకు అదునుగా మారింది. కొన్ని ఫేక్ యాప్స్ ను సృష్టించి.. వినియోగదారుల పర్సనల్ డేటాను సేకరించి వారిని బ్లాక్ మెయిల్‌ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా లోన్ యాప్స్ వాడే యూజర్స్ నుంచి సైబర్ నేరగాళ్లు అధిక వడ్డీ రాబట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ సంస్థ ECET.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 18 యాప్స్ ను తొలగించింది. వారు తొలగించిన డేంజరస్‌ యాప్స్ ఇవే..

  • ఏఏ క్రెడిట్ యాప్
  • ఈజీ క్రెడిట్ యాప్
  • ప్రెస్టమోస్ క్రెడిటో యాప్
  • గో క్రెడిటో యాప్
  • రాపిడో క్రెడిటో యాప్
  • అమోర్ క్యాష్ యాప్
  • గేయ బ్యాక్యాష్ యాప్
  • క్యాష్ వావ్ యాప్
  • ఫ్లాష్ లోన్ యాప్
  • గో క్రెడిటో యాప్
  • కార్టేరా గాండ్రే యాప్
  • ఫైనప్ లెండింగ్ యాప్
  • ట్రూనైరా యాప్
  • ఫోర్ యష్ క్యాష్ యాప్
  • ఈజీ క్యాష్ యాప్

మొదలగు యాప్స్ ను నిషేదించారు. అయితే ఈ యాప్స్ వాడే వారిలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేసియాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. సైబర్‌ మోసగాళ్లు ఈ ప్రాంతాల యూజర్స్నే ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా ECET తెలిపింది. ఈ నేపథ్యంలో ఇటువంటి సైబర్ నేరగాళ్ల నుంచి, ఫేక్ యాప్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు. ఏదేమైనా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు కొత్త యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకునేముందు.. వారి వ్యక్తిగత సమాచారాన్ని భద్ర పరుచుకోవడం ఎందుకైనా మంచింది. మరి, పైన తెలిపిన లోన్ యాప్స్‌పై ECET సంస్థ నిషేధం విధించటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.