iDreamPost
android-app
ios-app

108MP కెమెరాతో రెడ్ మీ కొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరలోనే

Redmi 13 5G: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? రెడ్ మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. బడ్జెట్ ధరలో క్రేజీ ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర ఎంతంటే?

Redmi 13 5G: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? రెడ్ మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. బడ్జెట్ ధరలో క్రేజీ ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర ఎంతంటే?

108MP కెమెరాతో రెడ్ మీ కొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరలోనే

మొబైల్ యూజర్లకు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ ఫీచర్లు, అదిరిపోయే డిజైన్ కలిగిన ఫోన్ కోసం చూసేవారికి రెడ్ మీ నుంచి న్యూ ఫొన్ మార్కెట్ లోకి విడుదలైంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రెడ్ మీ మొబైల్స్ కు మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. రెడ్ మీ నుంచి రిలీజ్ అయ్యే ఫోన్లు హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. యూజర్ల కోసం లేటెస్ట్ ఫీచర్లతో సరికొత్త మొబైల్స్ ను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నది రెడ్ మీ కంపెనీ. లేటెస్ట్ గా రెడ్ మీ నుంచి రెడ్ మీ 13 5జీ మోడల్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. దీని ధర ఎంతంటే?

కొత్త ఫోన్ కొనాలనుకునే వారు ప్రధానంగా కెమెరా పనితీరు, బ్యాటరీ సామర్ధ్యం, ప్రాసెసర్ వంటి ఫీచర్లను చూస్తుంటారు. కెమెరా క్వాలిటీ హైగా ఉండాలనుకునే వారికి రెడ్ మీ 13 5జీ బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ లో 108 ప్రధాన కెమెరాను అందించారు. షావోమి హైపర్‌ ఓఎస్‌తో వస్తున్న ఫస్ట్ రెడ్‌మీ ఫోన్‌ ఇదే. క్రిస్టల్‌ గ్లాస్‌ డిజైన్‌తో రూపొందిన ఈ ఫోన్‌ యూజర్లను ఆకట్టుకుంటోంది. బడ్జెట్‌ ధరలోనే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ రెడ్‌మీ కొత్త ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. మొదటిది 6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌. దీని ధర రూ.12,999. రెండోది 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ కలిగి ఉంటుంది. దీని ధర రూ.14,999 గా నిర్ణయించారు.

రెడ్ మీ 13 5జీ ఫీచర్లు:

ఈ ఫోన్‌కు 120 హెచ్ జెడ్ రీఫ్రెష్‌ రేటుతో 6.79 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ఏఈ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 33వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,030ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. సెల్ఫీల కోసం 13ఎంపీ కెమెరా ఉంది. కెమెరా పక్కనున్న రింగ్‌ ఫ్లాష్‌ దీనిలోని ప్రత్యేకత. ఫొటో క్యాప్చర్ చేసేటపుడే కాకుండా కాల్స్‌, నోటిఫికేషన్స్‌ సమయంలోనూ ఇది ఫ్లాష్‌ అవుతుంది. కంపెనీ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్‌లతోపాటు అమెజాన్‌లో ఈ ఫోన్‌ జూలై 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభంకానున్నది.