P Venkatesh
స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రియల్ మీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.
స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రియల్ మీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.
P Venkatesh
మార్కెట్ లోకి మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రియుల ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా స్మార్ట్ ఫోన్లను రూపొందించి రిలీజ్ చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు కొంత మంది ఎక్కువ కాలం వాడేందుకు ఇష్టపడరు. మార్కెట్ లోకి కొత్త ఫోన్ వస్తే చాలు వెంటనే కొనేస్తుంటారు. స్మార్ట్ ఫోన్ తయారీలో రియల్ మీ దూసుకెళ్తోంది. ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. ప్రముఖ కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. దీంతో రియల్ మీ భారత మార్కెట్ లో తన హవా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రియల్ మీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.
రియల్‌మి ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మి నార్జో 70X 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ మొబైల్ 45W ఛార్జింగ్ సపోర్టుతో రూ.12000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తామని రియల్‌మి ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలను ఇంకా వెల్లడించలేదు. కాగా పలు రిపోర్ట్ ల ఆధారంగా రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 2400*1080 పిక్సల్ రిజల్యూషన్‌తో కూడిన 6.67 అంగుళాల పుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది.
120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ సహా 2200Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. గ్లాస్ డిజైన్ సహా ఎయిర్ గెశ్చర్ వంటి ప్రత్యేక ఫీచర్లతో లాంచ్ అయింది. 67W వైరడ్ SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. రియల్ మీ నార్జో 70x 5G స్మార్ట్‌ఫోన్ ధర విషయానికి వస్తే.. రూ. 12,000 కంటే తక్కువ ధరకే ఫోన్ లాంచ్ అయే అవకాశం ఉంది.
Never run low on power again! #realmeNARZO70x offers the better 45W charging under 12K that keeps you powered up on the go.
Witness the unstoppable power!
Launching on 24th April, 12 Noon
Know more on @amazonIN: https://t.co/1BjaKhRsjw pic.twitter.com/Map1BUOch3
— realme narzo India (@realmenarzoIN) April 17, 2024