iDreamPost
android-app
ios-app

Realme న్యూ 5జీ స్మార్ట్ ఫోన్.. క్రేజీ ఫీచర్స్.. ధర రూ.9,999 మాత్రమే

Realme C63 5G: స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో కొత్త 5జీ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. రియల్ మీ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. దీన్ని రూ. 9999కే 5జీ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

Realme C63 5G: స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో కొత్త 5జీ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. రియల్ మీ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. దీన్ని రూ. 9999కే 5జీ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

Realme న్యూ 5జీ స్మార్ట్ ఫోన్.. క్రేజీ ఫీచర్స్.. ధర రూ.9,999 మాత్రమే

ఇప్పుడంతా 5జీ స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో సరికొత్త మొబైల్స్ మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. అయితే 5జీ స్మార్ట్ ఫోన్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండడం వల్ల కొనేందుకు ఆలోచిస్తున్నారు. బ్రాండెడ్ 5జీ ఫోన్ కావాలంటే 15-20 వేలు వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి తక్కువ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్ లభిస్తే బాగుండని చూస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. మరో కొత్త మొబైల్ మార్కెట్ లోకి లాంఛ్ అయ్యింది. ప్రముఖ చైనా మొబైల్ తయారీ కంపెనీ రియల్ మీ రూ. 9999కే క్రేజీ ఫీచర్లతో రియల్ మీ సీ63 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.

రియల్ మీ ఫోన్లకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. రియల్ మీ ఫోన్లు మార్కెట్ లో హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. బడ్జెట్ ధర అదిరిపోయే ఫీచర్లు ఉంటుండడంతో రియల్ మీ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. యూజర్ల అభిరుచులకు తగ్గట్టుగా తక్కువ ధరలోనే 5జీ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. రియల్ మీ సీ63 5జీ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ ధర రూ.10,999 ,6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ ధర రూ. 11,999 మరియు 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 12,999 గా ఉంది. స్టార్రి గోల్డ్, ఫారెస్ట్ గ్రీన్ అనే రెండు కలర్స్ లో లభించనున్నది. ఆగస్టు 20 నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ సేల్ సందర్భంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు.

రియల్ మీ సీ63 5జీ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్‌తో ఆధారితమైనది మరియు 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ 10వాట్ వైర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక 32ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ముందు భాగంలో, రియల్‌మి సీ63 5జీ కి 8ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చబడి ఉంది. ఇది సెల్ఫీలను మెరుగుపరచడానికి ఏఐ బ్యూటీ మోడ్‌ను కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.