nagidream
Best Budget 5G Smartphones: బడ్జెట్ లో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారికి రియల్ మీ నుంచి అద్భుతమైన ఫోన్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా లాంచ్ డేట్ కి ముందు ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వారికి డిస్కౌంట్ సహా అనేక ఇతర ప్రయోజనాలు వర్తించనున్నాయి.
Best Budget 5G Smartphones: బడ్జెట్ లో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారికి రియల్ మీ నుంచి అద్భుతమైన ఫోన్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా లాంచ్ డేట్ కి ముందు ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వారికి డిస్కౌంట్ సహా అనేక ఇతర ప్రయోజనాలు వర్తించనున్నాయి.
nagidream
చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ సిరీస్ లో రియల్ మీ 13, రియల్ మీ 13+ 5జీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. రెండు స్మార్ట్ ఫోన్లు స్పోర్ట్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో, మీడియా టెక్ డైమెన్సిటీ చిప్ సెట్ తో వస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్నాయి. రియల్ మీ 13 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ స్పేస్ తో ఒక వేరియంట్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ స్పేస్ తో మరొక వేరియంట్ వస్తున్నాయి. మొదటి వేరియంట్ ధర రూ. 17,999 కాగా రెండో వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ డార్క్ పర్పుల్, స్పీడ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ తో వస్తుంది. ఫ్లిప్ కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్ సైట్ లో స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 6 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై వెయ్యి రూపాయల ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఎక్స్ చేంజ్ బోనస్ కింద అదనంగా 2 వేల రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. ఆగస్టు 29 సాయంత్రం 6 గంటల తర్వాత ప్రీ బుకింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ ప్రీ బుకింగ్ లో భాగంగా 3 వేల రూపాయల వరకూ ప్రయోజనాలు పొందవచ్చు. మరోవైపు రియల్ మీ 13+ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తున్న వేరియంట్ ధర రూ. 22,999 కాగా 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తున్న వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ స్పేస్ వేరియంట్ ధర రూ. 26,999గా నిర్ణయించింది కంపెనీ. ఈ రియల్ మీ 13+ స్మార్ట్ ఫోన్ విక్టరీ గోల్డ్, స్పీడ్ గ్రీన్, డార్క్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పై 1500 రూపాయల వరకూ క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రీ బుకింగ్ చేసుకుంటే 575 రూపాయల విలువ చేసే స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ని 6 నెలల వ్యవధితో లభిస్తుంది.
ఇది 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో 1080*2400 పిక్సెల్ రిజల్యూషన్ తో, 120 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 680 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ లెవల్స్ తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ పోర్ట్రైట్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఐపీ64 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్ తో వస్తుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 120 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో, 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. పాండా గ్లాస్ లేయర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. రెయిన్ వాటర్ టచ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం, స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఐపీ65 రేటింగ్ తో వస్తుంది. ఇందులో కూడా 50 ఎంపీ మెయిన్ సెన్సార్ కెమెరా, 2 ఎంపీ పోర్ట్రైట్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో.. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.