iDreamPost
android-app
ios-app

స్మార్ట్ ఫోన్ లవర్స్ కు పండగే.. ఇకపై రూ.8 వేలకే 5జీ ఫోన్‌!

  • Published Jul 30, 2024 | 10:35 PM Updated Updated Jul 30, 2024 | 10:35 PM

Snapdragon 4S Gen 2: స్మార్ట్ ఫోన్ లవర్స్ కు 5జీ స్మార్ట్ ఫోన్లు మరింత చౌకగా లభించనున్నాయి. ఇకపై కేవలం రూ. 8 వేలకే అందుబాటులోకి రానున్నాయి.

Snapdragon 4S Gen 2: స్మార్ట్ ఫోన్ లవర్స్ కు 5జీ స్మార్ట్ ఫోన్లు మరింత చౌకగా లభించనున్నాయి. ఇకపై కేవలం రూ. 8 వేలకే అందుబాటులోకి రానున్నాయి.

స్మార్ట్ ఫోన్ లవర్స్ కు పండగే.. ఇకపై రూ.8 వేలకే 5జీ ఫోన్‌!

స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగి పోయింది. అన్ని వయసుల వారు స్మార్ట్ ఫోన్లను యూజ్ చేస్తున్నారు. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలన్నీ కళ్లు చెదిరే ఫీచర్లతో మొబైల్స్ ను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు 5జీ నెట్ వర్క్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో అంతా 5జీ ఫోన్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొబైల్ తయారీ కంపెనీలు సైతం 5జీ ఫోన్లను తయారు చేసే పనిలో పడ్డాయి. అయితే 5జీ ఫోన్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. లేటెస్టు ఫీచర్లున్న 5జీ ఫోన్ కొనాలంటే 15 నుంచి 20 వేలు అయినా వెచ్చించాల్సి వస్తుంది. కానీ ఇక నుంచి ఆ చింత అవసరం లేదు. ఇకపై రూ. 8 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్ లభించనున్నది.

4జీ స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలోనే లభిస్తున్నప్పటికీ ఇప్పుడు అందరి దృష్టి 5జీ ఫోన్లపై పడింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలన్నీ 5జీ ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇకపై తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్లు లభించనున్నాయి. కారణం ఏంటంటే? యూఎస్ కు చెందిన చిప్ తయారీ సంస్థ క్వాల్ కామ్ కొత్త ప్రాసెసర్ ను రిలీజ్ చేసింది. దీంతో 5జీ ఫోన్ల ధరలు భారీగా దిగిరానున్నట్లు కంపెనీ తెలిపింది. రూ. 8 వేలు లేదా అంతకంటే తక్కువకే 5జీ స్మార్ట్ ఫోన్లు లభించనున్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఇక పండగే. రూ. 8 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు.

క్వాలక్ కామ్ కంపెనీ భారత్ లో స్నాప్ డ్రాగన్ ఫర్ ఇండియా ఈవెంట్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా 5జీ ఫోన్ల కోసం ప్రత్యేకంగా స్నాప్ డ్రాగన్ 4ఎస్ జన్ 2ప్రాసెసర్ ను రిలీజ్ చేసింది. ఈ కొత్త ప్రాసెసర్ తో 5జీ స్మార్ట్ ఫోన్ల ధరలు దిగిరానున్నాయి. చైనా బ్రాండ్ షావోమీతో పాటు మరికొన్ని కంపెనీలు ఈ ప్రాసెసర్ ను వినియోగించనున్నాయి. 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తక్కువ ధరకే 5జీ ఫోన్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కొత్త చిప్ సెట్ ను తీసుకొచ్చినట్లు క్వాల్ కామ్ ఇండియా ప్రెసిడెంట్ సావి సోయిన్ తెలిపారు.