iDreamPost
android-app
ios-app

8GB ర్యామ్+ 256 GB స్టోరేజ్.. ధర మాత్రం రూ.20 వేలలోపే!

Poco X6 5G SmartPhone Series: స్మార్ట్ ఫోన్ అనగానే అందరూ ధర చాలా ఎక్కువ అనుకుంటారు. కానీ, ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఒకటి మార్కెట్ లోకి వచ్చేసింది.

Poco X6 5G SmartPhone Series: స్మార్ట్ ఫోన్ అనగానే అందరూ ధర చాలా ఎక్కువ అనుకుంటారు. కానీ, ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఒకటి మార్కెట్ లోకి వచ్చేసింది.

8GB ర్యామ్+ 256 GB స్టోరేజ్.. ధర మాత్రం రూ.20 వేలలోపే!

ఈరోజుల్లో మొబైల్ అంటే 5జీ అనే పరిస్థితి వచ్చేసింది. కంపెనీలు కూడా 4జీ ఫోన్లను కాదని 5జీ ఫోన్లనే రిలీజ్ చేస్తన్నాయి. అయితే 5జీ ఫోన్ అనగానే అందరూ రూ.30 వేలు ఉండాల్సిందే అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మొబైల్ కంపెనీలు కూడా అతి తక్కువ ధరలోనే 5జీ ఫోన్లలను తీసుకురావాలని భావిస్తున్నాయి. కానీ, ధరను తగ్గించేసి ఫీచర్స్ ని కూడా తగ్గించేస్తున్నాయి. పోకో కంపెనీ మాత్రం అదిరిపోయే ఫీచర్లు, ర్యామ్, స్టోరేజ్ ఇస్తూ కూడా ధర మాత్రం రూ.22 వేలలోపే అందిస్తోంది. మరి.. ఆ మోడల్ ఏంటి? ఆ ఫోన్ ఫీచర్స్ ఏంటి? ఎక్కడ కొనుగోలు చేయాలి? అనే ఇంట్రస్టింగ్ విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

పోకో కంపెనీకి భారత మార్కెట్ లో చాలా మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా మోడల్స్ కు ఫుల డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ క్రేజ్ ని వాడుకుంటూ పోకో మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రచించింది. 5జీ నెట్ వర్క్ లో కూడా వారి మార్క్ చూపించేందుకు పోకో ఎక్స్6 సిరీస్ 5జీ ఫోన్ ని రిలీజ్ చేసింది. జనవరి 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్స్ అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్స్ పోకో డీలర్స్, ప్రముఖ రిటైల్ స్టోర్స్, ఆన్ లైన్ లో అయితే ఫ్లిప్ కార్ట్ లో సేల్ కి అందుబాటులో ఉన్నాయి. లాంఛింగ్ కింద కంపెనీ మంచి డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది.

అలాగే ఎక్స్ ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. వాటికి అదనంగా బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్స్ మీద కూడా అదనపు డిస్కౌంట్స్ ను అందిస్తున్నారు. ఈ పోకో ఎక్స్6 5జీ సిరీస్ ఫోన్లలో పోకో ఎక్స్6 5జీ, పోకో ఎక్స్6 ప్రో 5జీ ఫోన్ అని రెండు మోడల్స్ ఉన్నాయి. వీటిలో 8జీబీ ర్యామ్+ 25జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. ధర చూస్తే.. రూ.21,999 నుంచి ప్రారంభమవుతోంది. హైఎస్ట్ కాస్ట్ ప్రో మోడల్ లో 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ ధర రూ.28,999గా ఉంది. లాంఛింగ్ ఆఫర్ కింద.. బ్యాంక్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు. హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై అదనంగా రూ.2 వేలు తగ్గిస్తున్నారు. మీరు మీ పాత ఫోన్ ను ఎక్స్ ఛేంజ్ చేసుకోవాలి అనుకుంటే గరిష్టంగా రూ.24 వేల వరకు ఎక్స్ ఛేంజ్ బోనస్ లభిస్తుంది. మరిన్ని వివరాల కోసం ఫ్లిప్ కార్ట్ సైట్ ని లేదంటే పోకో అధికారిక వెబ్ సైట్ ని సందర్శించండి. పోకో ఎక్స్6 5జీ సిరీస్ ఫోన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

పోకో ఎక్స్6 5జీ స్పెసిఫికేషన్స్:

  • 1.5కే 120హెట్స్ ఆమోలెడ్ డిస్ ప్లే
  • స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రోసెసర్
  • 68.7 బిలియన్ కలర్స్
  • 64ఎంపీ ట్రిపుల్ కెమెరా విత్ ఓఐఎస్
  • 5100 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 64వాట్స్ టర్బో ఛార్జింగ్
  • ఎల్లో, గ్రే, బ్లాక్ కలర్స్