P Venkatesh
Poco Pad 5G: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం పోకో సరికొత్త ట్యాబ్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేయనున్నది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో వస్తున్న ఈ ట్యాబ్ తక్కువ ధరలోనే లభించనున్నట్లు తెలుస్తోంది.
Poco Pad 5G: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం పోకో సరికొత్త ట్యాబ్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేయనున్నది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో వస్తున్న ఈ ట్యాబ్ తక్కువ ధరలోనే లభించనున్నట్లు తెలుస్తోంది.
P Venkatesh
ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్లతో పాటు ప్యాడ్ లను యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. యూజర్ల ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టుగా అడ్వాన్స్డ్ ఫీచర్లతో సరికొత్త ట్యాబ్ లు మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థలు లేటెస్ట్ వర్షన్లతో సరికొత్త ట్యాబ్ లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం పోకో భారత మార్కెట్ లోకి కొత్త ట్యాబ్ ను లాంచ్ చేయనున్నది. పోకో ప్యాడ్ 5జీ పేరుతో అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ట్యాబ్ తక్కువ ధరలోనే యూజర్లకు లభించనున్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పోకో రిలీజ్ చేయనున్న కొత్త ట్యాబ్ ఆగస్టు 23న మార్కెట్ లోకి రానున్నది. పోకో ప్యాడ్ 5జీ ట్యాబ్‌లో 12.1 అంగుళాల డిస్‌ప్లే అందించారు. 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇక ఈ ట్యాబ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ట్యాబ్‌ను 256 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్‌తో లాంచ్ చేస్తున్నారు. ఈ ట్యాబ్‌తో పాటు కీబోర్డ్, స్టైలప్ పెన్ను కూడా అందిస్తున్నారు. యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ట్యాబ్ పనిచేస్తుంది.
ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాను ఇచ్చారు. పోకో ప్యాడ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 10,000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ సామార్థ్యంతో వస్తుంది. సినిమాటిక్ ఆడియో విజువల్ కోసం డాల్బీ అట్మాస్ 4 స్పీకర్లను అందించారు. స్లిమ్ అండ్ స్మూత్ గా ఉన్న ఈ ప్యాడ్ బిగ్ డిస్ల్పేతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ ప్యాడ్ ధర రూ. 20 వేల కంటే తక్కువగానే అందుబాటులోకి రానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.