iDreamPost
android-app
ios-app

అదిరిపోయే ఫీచర్లతో.. Oppo నుంచి మరో 5జీ ఫోన్

  • Published Jul 22, 2024 | 10:11 PM Updated Updated Jul 22, 2024 | 10:11 PM

Oppo K12x 5G: స్మార్ట్ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. మరో కొత్త ఫోన్ మార్కెట్ లోకి రాబోతోంది.లేటెస్ట్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఒప్పో నుంచి అదిరిపోయే ఫీచర్లతో మరో 5జీ ఫోన్ లాంచింగ్ కు సిద్ధమవుతోంది.

Oppo K12x 5G: స్మార్ట్ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. మరో కొత్త ఫోన్ మార్కెట్ లోకి రాబోతోంది.లేటెస్ట్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఒప్పో నుంచి అదిరిపోయే ఫీచర్లతో మరో 5జీ ఫోన్ లాంచింగ్ కు సిద్ధమవుతోంది.

అదిరిపోయే ఫీచర్లతో.. Oppo నుంచి మరో 5జీ ఫోన్

స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. లేటెస్ట్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఒప్పో నుంచి అదిరిపోయే ఫీచర్లతో మరో 5జీ ఫోన్ లాంచింగ్ కు సిద్ధమవుతోంది. ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పో ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. కెమెరా క్వాలిటీ బాగుండడంతో ఒప్పో ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ధరలు కూడా బడ్జెట్ ధరలోనే ఉండడంతో ఫోన్ లవర్స్ ఈ మొబైల్స్ ను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఒప్పో కంపెనీ తన ఒప్పో కే12ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

దాదాపు అందరూ కూడా 5జీ ఫోన్లను తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు సైతం 5జీ ఫోన్లను అదిరిపోయే ఫీచర్లతో రూపొందించి రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ భారత్ మార్కెట్లో ఈ నెల 29న ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్‌లో సర్క్యులర్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు వెర్టికల్ పిల్ షేప్డ్ మాడ్యూల్‌లో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్రీజ్ బ్లూ, మిడ్ నైట్ వయోలెట్ కలర్స్ లో లభిస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+స్క్రీన్ కలిగి ఉంటుంది.

ట్వైస్ రీఇన్ ఫోర్స్డ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తోంది. యూజర్లు ఫ్రంట్, రేర్ కెమెరాలతో ఒకేసారి వీడియో రికార్డ్ చేయొచ్చు. 45వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. క్వాల్కం స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ తో వస్తుంది. 8జీబీ ర్యామ్ 128 స్టోరేజీ, 12జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లతో రానున్నట్లు తెలుస్తుంది. ఫింగర్ ప్రిట్ సెన్సార్ ఉంది. ఇక ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ ధర విషయానికి వస్తే.. రూ. 20 వేల లోపు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.